మూడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశాడు. తర్వాత చిన్నారి శవాన్ని ఓ సంచిలో మూటగట్టాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Also Read బరువు తగ్గడానికి ట్యాబ్లెట్స్ మింగిన డ్యాన్సర్.. కొద్దిసేపటికే.....

పూర్తి వివరాల్లోకి వెళితే... సీతాపూర్ లోని మహోలీ ప్రాంతానికి చెందిన దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. సోమవారం సాయత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి.. అనూహ్యాంగా కనపడకుండా పోయింది. గమనించిన తల్లిదండ్రులు చుట్టపక్కల మొత్తం గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. కాగా... వారి ఎదురింటలో ఓ సంచి అనుమానాస్పదంగా కనపడింది.

అది తెరచి చూడగా.. అందులో చిన్నారి శవమై కనిపించింది. ఆ ఇంట్లో ఉండే రాజు అనే వ్యక్తే బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.