పరువుహత్య... కూతురితో పాటు ఎస్సైని కాల్చిచంపిన తండ్రి

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 10, Aug 2018, 3:20 PM IST
father kills daughter and police in rohtak
Highlights

అల్లారుముద్దుగా పెంచకున్న కూతురిని పరువు కోసం కాల్చిచంపాడో కసాయి తండ్రి. కుటుంబ సభ్యులను ఎదిరించి ఓ దళిత యువకున్ని ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు.. అయితే ఈ కాల్పులు ఏకంగా కోర్టు ఆవరణలోనే జరగడం, ఇందులో ఓ ఎస్సై కూడా మరణిచడం జరిగింది.

అల్లారుముద్దుగా పెంచకున్న కూతురిని పరువు కోసం కాల్చిచంపాడో కసాయి తండ్రి. కుటుంబ సభ్యులను ఎదిరించి ఓ దళిత యువకున్ని ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు.. అయితే ఈ కాల్పులు ఏకంగా కోర్టు ఆవరణలోనే జరగడం, ఇందులో ఓ ఎస్సై కూడా మరణిచడం జరిగింది.

 హర్యానాలోని రోహ్‌తక్‌ పట్టణంలో నివాసముండే రమేష్ దంపతులకు పిల్లలు కలగక పోవడంతో తమ బందువుల అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు మమత అని పేరుపెట్టి చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే మమత అదే ప్రాంతానికి చెందిన సోంబీర్ అనే దళిత యువకున్ని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

అయితే మమత ఇంకా మైనర్ కావడంతో రమేష్ తన కూతురిని సోంబేర్ కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సోంబీర్ ను అరెస్ట్ చేశారు. అయినప్పటికి మమత ఇంటికి రాకుండా సోంబీర్ ఇంట్లోనే ఉంటోంది.

ఇవాళ సోంబీర్ ను రోహ్‌తక్ కోర్టులో హాజరుపర్చారు. అయితే ఇక్కడికి వచ్చిన కూతురుని చూడగానే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన తండ్రి రమేష్ నిన్ను మరికొద్దిసేపట్లో చంపేస్తానని బెదిరించాడు. అయితే అతడు కోపంలో అలా అంటున్నాడని అందరూ భావించారు. కానీ అతడె అలా అన్న కొద్దిసేపటికే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి కోర్టు ఆవరణలోనే మమతను తుపాకీతో కాల్చి చంపారు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన స్థానిక ఎస్సైపై కూడా కాల్పులు జరపడంతో అతడు కూడా మృతిచెందాడు.
 

  

loader