Asianet News TeluguAsianet News Telugu

కొట్టాడని తండ్రిపై పగ.. కిరాయి హంతకులతో చంపించిన కొడుకు

చెడు తిరుగుళ్లు తిరగొద్దని.. కొడుకుని మంచిదారిలో పెడదామని తండ్రి చేయిచేసుకోవడం అతని ప్రాణాలను తీసింది. ఢిల్లీకి చెందిన కెమికల్ వ్యాపారి అనిల్ ఖోడా హత్యోందంతంలో అసలు సూత్రధారి కుమారుడు గౌరవ్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

father killed by son
Author
Delhi, First Published Oct 9, 2018, 8:50 AM IST

చెడు తిరుగుళ్లు తిరగొద్దని.. కొడుకుని మంచిదారిలో పెడదామని తండ్రి చేయిచేసుకోవడం అతని ప్రాణాలను తీసింది. ఢిల్లీకి చెందిన కెమికల్ వ్యాపారి అనిల్ ఖోడా హత్యోందంతంలో అసలు సూత్రధారి కుమారుడు గౌరవ్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

అతను చెడు అలవాట్లకు, తిరుగుళ్లకు అలవాటు పడి తండ్రిని తరచూ వేధించేవాడు.. కొడుకు తీరుతో విసుగు చెందిన అనిల్ ఖోడా అతనికి డబ్బులు ఇవ్వడం మానేశాడని తేలింది. దీనిలో భాగంగానే ఒక రోజు ఇద్దరికి వాగ్వివాదం జరిగిందని.. ఈ క్రమంలో కొడుకును కొట్టాడని పోలీసులు తెలిపారు.

తండ్రిపై కోపంతో రగిలిపోయిన గౌరవ్ ఆయన హత్యకు పథకం పన్నాడు. ఇందుకోసం కిరాయి హంతకులతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక రోజు అనిల్ తన కార్యాలయంలో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా... బైక్‌పై వచ్చిన ఆగంతకులు ఆయనపై కాల్పులు జరపడంతో.. అనిల్ అక్కడికక్కడే మరణించాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. గౌరవ్‌తో పాటు ఈ హత్యలో ప్రమేయం ఉన్న అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios