కొడుకు చనిపోయాడని... 28ఏళ్ల కోడలితో 70ఏళ్ల మామ పెళ్లి...!
ఇక కోడలి వయసు 28ఏళ్లు కాగా... మామ వయసు 70ఏళ్లు కావడం గమనార్హం. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

కొడుకు భార్యను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. తనకు భార్య చనిపోయిందని.... తన కోడలికి కూడా భర్త దూరమయ్యాడని.. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక కోడలి వయసు 28ఏళ్లు కాగా... మామ వయసు 70ఏళ్లు కావడం గమనార్హం. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ జిల్లాలోని చపియా ఉమ్రావ్ గ్రామంలో కైలాష్ యాదవ్ అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. 12ఏళ్ల క్రితం ఆయనకు భార్య చనిపోయింది. వారికి నలుగురు సంతానం. వారికి నలుగురు సంతానం కాగా....వేరు కాపురాలు పెట్టుకొని హాయిగా జీవిస్తున్నారు. కాగా.. కైలాష్ యాదవ్ మూడో కుమారుడు కొంత కాలం క్రితం చనిపోయాడు. దీంతో.... అతని భార్య పూజ ఒంటరిగా నివసిస్తోంది. దీంతో.... ఆమెను కైలాష్ రెండో వివాహం చేసుకోవడం గమనార్హం. మామ కోడలిని పెళ్లి చేసుకోవడమే.. అందరినీ ఆశ్చర్య పరిచింది అంటే..... వారి వయసు తేడా మరింత షాక్ కి గురి చేయడం విశేషం.