అప్పుడే పుట్టిన కొడుకొని.. సజీవసమాధి చేయాలనుకున్న తండ్రి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 2, Jan 2019, 10:30 AM IST
Father held for trying to abandon newborn baby
Highlights

అప్పుడే పుట్టిన తన కొడుకుని ఓ తండ్రి.. బతికుండగానే చంపేయాలనుకున్నాడు. ఇంకా కళ్లు కూడా తెరవని పసికందుని.. శాశ్వతంగా కన్నుమూసేలా చేయాలని భావించాడు.

అప్పుడే పుట్టిన తన కొడుకుని ఓ తండ్రి.. బతికుండగానే చంపేయాలనుకున్నాడు. ఇంకా కళ్లు కూడా తెరవని పసికందుని.. శాశ్వతంగా కన్నుమూసేలా చేయాలని భావించాడు. కానీ.. స్థానికులు చూడటంతో.. ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర సంఘటన జమ్మూకశ్మీర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లో వెళితే... జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాకు చెందిన మంజూర్ హుస్సేన్ బన్యారి భార్య రెండు రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  కాగా బాబుకి పుట్టుకతోనే ఏదో జబ్బుతో పుట్టాడు. ఆ జబ్బు తగ్గాలంటే.. చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

అయితే.. తన బిడ్డకు వైద్యం చేయించేంత స్థోమత లేకపోవడంతో.. పుట్టిన బిడ్డను పురిట్లోనే చంపేయాలని పథకం వేశాడు. భార్య పక్కన ఉన్న బిడ్డను తీసుకొని వెళ్లి.. ఎవరూ చూడని ప్రాంతంలో సజీవసమాధి చేయాలనకున్నాడు. అయితే.. స్థానికులు అతను చేస్తున్న పనిని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే.. హుస్సేన్ ని పోలీసులకు అప్పగించాడు. బిడ్డను తల్లివద్దకు క్షేమంగా చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

loader