భార్య ఇంట్లో లేని సమయంలో మైనర్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కీచకతండ్రి. దీనిమీద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏడు గంటల తరువాత కరెంట్ షాక్ తో ఆ వ్యక్తి మృతి చెందాడు. 

ఇండోర్ : మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మైనర్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన ఏడు గంటల తరువాత ఆ వ్యక్తి వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఎంపీ దేవాస్ జిల్లాలో వెలుగు చూసింది.

దీనికి సంబంధించిన వివరాల్లో వెడితే...సెప్టెంబర్ 1 (శుక్రవారం) అర్ధరాత్రి తన తండ్రి తనపై అత్యాచారం చేశాడని 14 ఏళ్ల బాలిక ఆరోపించింది. ఆమె తన తమ్ముడితో కలిసి నిద్రిస్తుండగా, ఆమె తండ్రి తాగి వచ్చి బలవంతంగా ఆమెను బలవంతం చేశాడు. 

నాకు కీడు చేసేందుకు భార్య చేతబడి చేస్తోంది.. బెంగళూరులో పోలీసులను ఆశ్రయించిన వ్యాపారవేత్త..

ఆ సమయంలో రక్షా బంధన్ వేడుకలు జరుపుకోవడానికి ఆమె తల్లి పుట్టింటికి వెళ్లిందని.. తన తల్లి ఇంట్లో లేకపోవడంతో తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.

మరుసటి రోజు, 10వ తరగతి చదువుతున్న ఆ బాధిత బాలిక, బంధువుతో కలిసి తన తల్లి దగ్గరికి వెళ్లింది. విషయాన్ని తెలిపింది. ఆమె ఇతర కుటుంబ సభ్యులతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తల్లి, మామ బాలికను ఖతేగావ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె తండ్రి మీద ఫిర్యాదు చేసింది.

కాగా, అత్యాచారం చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు, ఆ తరువాత 7 గంటల్లో శవమై కనిపించాడు. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. మా స్టేషన్ లో మహిళా అధికారి లేరు. కాబట్టి, నెమావార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ని పిలిపించాం. బాలిక నుండి అందిన సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత కేసు నమోదు చేశాం”అని ఖటేగావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విక్రాంత్ ఝంజోట్ తెలిపారు.

నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్లు 376(3), 506 కింద కేసు నమోదు చేసినట్లు ఝంజోట్ తెలిపారు. ఫిర్యాదు చేస్తే చనిపోతానని తండ్రి బెదిరిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

శనివారం రాత్రి బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్యపరీక్షలు చేశారు. ఏడు గంటల తరువాత, ఆదివారం తెల్లవారుజామున, నిందితుడు తన ఇంటికి సమీపంలోని పొలంలో శవమై కనిపించాడని ఝంజోట్ చెప్పారు. 

"అతను ఒక పొలంలో నిద్రించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అతను తాగి ఉన్నాడు. తెల్లారేసరికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టంలో విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు నిర్ధారించారని ఝంజోత్ తెలిపారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)