ముగ్గురు భర్తలను వదిలేసి ఒంటరిగా ఉంటోందో మహిళ. ఆమె ప్రవర్తనతో విసుగొచ్చిన తండ్రి కిరాతకంగా హతమార్చాడు. 

తమిళనాడు : జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్న కూతురిని దారుణంగా హతమార్చాడో తండ్రి. కూతురికి వివాహం చేసి పంపిస్తే అతడికి విడాకులు ఇచ్చి ఆ తర్వాత మరో ఇద్దరిని వివాహం చేసుకొని వారి నుండి కూడా విడిపోయింది ఆ కుమార్తె. ఆ తరువాత జులాయిగా తిరుగుతుండడంతో భరించలేకపోయాడు. ఆమెను హతమార్చాడు.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. తిరుచ్చిలోని దేవారం పట్టి దగ్గరలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం ఉన్నట్లుగా అటవీశాఖకు సమాచారం అందింది. దీంతో వారు వెళ్లి పరిశీలించి ఆ వివరాలను పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పూణెలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న వాహనంలో గుర్తింపు.. ఐదుగురు అరెస్ట్..

దీనిమీద దర్యాప్తు ప్రారంభించగా మృతురాలు తాపేట సమీపంలోని ఊరక్కరై గ్రామానికి చెందిన అరివళగన్ కుమార్తె ప్రియాంక అని తెలిసింది. ఆమె ముగ్గురిని వివాహం చేసిందని.. వారిని వదిలేసి ప్రస్తుతం ఒంటరిగా ఉంటుందని తేలింది. తన ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతోందని ఆగ్రహం చెందిన తండ్రి కూతురిని హతమార్చినట్లుగా బుధవారం విచారణలో తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.