Asianet News TeluguAsianet News Telugu

కూతురితో ప్రేమాయణం నడుపుతున్నాడని.. యువకుడిని దారుణంగా చంపిన తండ్రి...

వారిద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో తరచుగా కలుసుకునేవారు. ఇది పెద్దలకు తెలియదు. అలాగే ఆ రోజు కూడా యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివేశ్ వెళ్లాడు. ఇంతలో యువతి తండ్రి నారాయణ్ వచ్చాడు. ఇంట్లో ఇద్దరినీ ఏకాంతంగా చూసి పట్టలేని కోపంతో ఊగిపోయాడు.

father assasinated daughters lover in karnataka
Author
Hyderabad, First Published Dec 6, 2021, 7:31 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కర్ణాటక : ఓ ప్రేమ ఉదంతం విషాదాంతమయ్యింది. అర్థరాత్రి ప్రియురాలిని కలవడానికి ఇంటికి వచ్చిన ప్రియున్ని ఆమె తండ్రి కోపంతో murder చేశాడు. ఈ ఘటన గత 28వ తేదీ రాత్రి జరగ్గా, ఆదివారం నిందితున్ని arrest చేశారు. వివరాల్లోకి వెడితే.. 

బెంగళూరులో వినోబానగర ఆటోడ్రైవర్ నారాయణ్ కు ఓ daughter ఉంది. ఆమె ఇటీవల ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతను తమిళనాడుకు చెందిన నివేశ్ కుమార్. ఆ యువకుడు రెండు నెలల క్రితం ఇదే ప్రాంతానికి వచ్చి పెదనాన్న ఇంట్లో ఉంటున్నాడు. నారాయణ్ కూతురితో నివేశ్ ప్రేమాయణం ప్రారంభించాడు. 

వారిద్దరూ ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో తరచుగా కలుసుకునేవారు. ఇది పెద్దలకు తెలియదు. అలాగే ఆ రోజు కూడా యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివేశ్ వెళ్లాడు. ఇంతలో యువతి తండ్రి నారాయణ్ వచ్చాడు. ఇంట్లో ఇద్దరినీ ఏకాంతంగా చూసి పట్టలేని కోపంతో ఊగిపోయాడు.

కొన్ని అదృశ్య శక్తులు నా సంపదను దోచుకుంటున్నాయి.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు

పక్కనే ఉన్న stickతో నివేశ్ తలమీద గట్టిగా కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చూస్తే అప్పటికే చనిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. dead body ని వేకువజామున ఆటోలో తీసుకెళ్లి విక్టోరియా ఆస్పత్రి వద్ద పెట్టి అక్కడ నుంచి ఉడాయించాడు. పోలీసులు దర్యాప్తు చేసి ప్రియుని తండ్రి హత్య చేశాడని గుర్తించి అరెస్ట్ చేశారు.                                                                                                                     

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా Tanguturలో తల్లీ కూతుళ్ల హత్య కేసులో నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తల్లీ కూతుళ్లను హత్య చేసి బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. మృతులను sridevi, ఆమె కూతురు Venkata lekhaగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే  ఇంకొల్లు మండలం పూసపాడు సమీపంలో  వృద్ద దంపతులు  హత్యకు గురయ్యారు. 

ఎంత పని చేశావ్ తల్లి.. చిన్నారులని కూడా చూడకుండా ఐదుగురు పిల్లలను వెంట తీసుకెళ్లి..

వృద్దురాలి చెవిని కోసి బంగారు ఆభరణాలను దోచుకొన్నారు.  ఈ ఘటన నవంబర్ 19న చోటు చేసుకొంది. ఈ రెండు ఘటనల్లో ఒకే ముఠా ఉందని పోలీసులు అనుమానించారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. దోపిడి దొంగలు టంగుటూరు, ఒంగోలు, అద్దంకి మీదుగా హైద్రాబాద్ కు చేరుకొన్నారు. 

అక్కడి నుండి మహారాష్ట్రకు చేరుకొన్నారు. దీంతో పోలీసులు మహారాష్ట్రలోని solapur కు వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం నాడు శ్రీదేవి, వెంకట లేఖ మృతదేహలకు పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేశారుత. మృతదేహలను బంధువులకు అప్పగించారు.  హత్య జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ  మలికా గార్గ్ పరిశీలించారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్  లతో నేర స్థలాన్ని పరిశీలించారు.               

Follow Us:
Download App:
  • android
  • ios