గుజరాత్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. నిలిపి ఉన్న లారీని ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రధాని, గుజరాత్ సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని ఓ మినీ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు పిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పాటిల్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ చోటిలా ప్రాంతానికి చెందిన 23 మంది ఓ మినీ ట్రక్కులో సురేంద్రనగర్ జిల్లాకు వెళ్లారు. తిరిగి అదే ట్రక్కులో స్వస్థలానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ వాహనం రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై ప్రయాణం సాగిస్తోంది. అయితే అంతకు ముందు ఆ రోడ్డు వెళ్తున్న ఓ లారీ పంక్చర్ అయ్యింది. దీంతో దానిని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు.
ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటున్నదని భార్యను చంపిన భర్త.. ఆమె తండ్రీ సహకరించాడు!
అయితే ఉదయం 11 గంటల సమయంలో ఈ మినీ ట్రక్కు వెళ్లి నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తంగా 10 మంది మరణించారు. ఇందులో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీనిపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు.
కాగా, ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
