Asianet News TeluguAsianet News Telugu

పూణె హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. దాదాపు 48 వాహ‌నాలు ధ్వంసం.. కొన‌సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Maharashtra: పూణె హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 48 వాహనాలు దెబ్బతిన్నాయి. పూణెలోని నావేల్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అధికారులు రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నారు.
 

Fatal road accident on Pune highway.. Around 48 vehicles destroyed.. Rescue operation going on
Author
First Published Nov 20, 2022, 11:09 PM IST

Pune-Bangalore Highway: మహారాష్ట్రలోని పూణె-బెంగళూరు హైవేపై నవాలే వంతెన సమీపంలో ఆదివారం భారీ ప్రమాదం సంభవించింది. దాదాపు 48 వాహనాలు దెబ్బతిన్నాయి. పూణే అగ్నిమాపక దళం, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎమ్‌ఆర్‌డీఏ)కు సంబంధించిన  రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగుతోంది.

 

బెంగుళూరు-ముంబై హైవేపై నవాలే వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. రహదారి ఏటవాలుగా ఉండ‌టం, వాహనాల వేగవంతమైన వేగం కారణంగా ఈ ప్రదేశం ప్రమాదాలకు గురవుతుందని ఇండియా టుడే నివేదించింది.

 

పుణె అగ్నిమాపక దళం, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానిక మీడియా ప్రకారం, ట్రక్కు కంటైనర్ బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో అది ఇత‌ర వాహనాలను ఢీకొట్టింది. రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఆయిల్ రోడ్డుపైకి జారడంతో రోడ్డుపైకి ఇతర వాహనాలు చేరాయి.

 

ఈ ప్రమాదం కారణంగా సతారా నుంచి ముంబ‌యి వెళ్లే రహదారి హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఓ ప్ర‌యివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

మరో ప్రమాదంలో ఐదురుగు మృతి

ఇదిలావుండ‌గా, ముంబ‌యి-పూణె హైవేపై శుక్ర‌వారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.  గ‌త రాత్రి 11:30 గంటల సమయంలో బాధితులు పూణె నుంచి ముంబయి వెళ్తున్న మారుతీ సుజుకీ ఎర్టిగా కారు వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో  నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా ఖోపోలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురినీ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

"కారు పూణె నుండి ముంబైకి వెళుతుండగా 12 గంటలకు వెనుక నుండి ట్రక్కును ఢీకొట్టింది. కారులో తొమ్మిది మంది ప్రయాణీకులు ఉన్నారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు" అని ఖోపోలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. మృతులంతా పురుషులే కాగా, గాయపడిన నలుగురిలో ఒకరు మహిళ ఉన్నార‌ని తెలిపారు. కారు డ్రైవర్‌ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డ్రైవర్‌పై నేరం నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios