Asianet News TeluguAsianet News Telugu

లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచు కారణంగా ఢీకొన్న వాహనాలు.. ముగ్గురు మృతి..

యూపీలోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వల్ల అనేక వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. 

Fatal road accident on Lucknow-Agra Expressway.. Vehicles collided due to fog.. Three killed..
Author
First Published Dec 19, 2022, 5:01 PM IST

ఉత్తరప్రదేశ్ లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు వల్ల రోడ్డుపై దృశ్యమానత తగ్గడంతో అనేక వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకలు హింసాత్మకం.. వ్యక్తిపై కత్తితో దాడి.. పోలీసులపైనా దాడి

వివరాలు ఇలా ఉన్నాయి. శీతాకాలం వల్ల యూపీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ పొగమంచే పలు ప్రమాదాలకు కారణమవుతోంది. ఔరయ్యా, కాన్పూర్, రాయ్ బరేలీ, ఉన్నావ్, గ్రేటర్ నోయిడాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తాజా ఘటన ఎర్వకత్రా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఉమ్రైన్ పట్టణం సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో విజిబులిటీ తక్కువగా ఉంది. దీంతో ట్రక్కులు, బస్సులు, కార్లు పాటు పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. 

ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అదే సమయంలో 8 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎర్వకత్ర పోలీస్‌స్టేషన్‌, యూపీఐడీఏ బృందం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదం వల్ల రోడ్డుపై వాహనాలు పేరుకుపోయాయి. కొంత సమయం తరువాత పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

అలాగే ఉన్నావ్‌ జిల్లాలో కూడా సోమవారం ఇలాంటి ప్రమాదమే జరిగింది. పొగమంచు కారణంగా రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ ట్రక్కు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బాటసారులు పోలీసులు, క్రేన్ సహాయంతో రక్షించారు. పూర్వ కొత్వాలి ప్రాంతానికి 11 మైళ్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

రూ. 10 వేలు ఇవ్వండి.. లైంగిక వేధింపుల కేసు సెటిల్ చేస్తాం.. అవినీతికి పాల్పడిన ఇద్దరు పోలీసులపై వేటు

ఇటీవల రాయ్‌బరేలీలో స్కూల్ వ్యాన్ జేసీబీని ఢీకొట్టింది. దీంతో 6 గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఆ వ్యాన్ డ్రైవర్ వాహనంలోని ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీశారు. చిన్నారులను సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios