రాజస్థాన్ లో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లో ఓ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చనిపోగా..మరో 12 మంది గాయపడ్డారు.
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోంక్ జిల్లాలో ఓ వ్యాన్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు చనిపోయారు. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందని వారు ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. జాతీయ రహదారిపై దేవ్దావాస్ క్రాసింగ్ వద్ద రాజస్థాన్ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో బీజేపీకి భారీ షాక్.. కాషాయ కంచుకోటలో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ..
డియోలీకి చెందిన భక్తులు ఖాతు శ్యామ్ ఆలయంలో పూజలు చేసి తిరిగి ఇంటికి వ్యాన్ లో ప్రయాణం ప్రారంభించారు. అయితే దేవ్దావాస్ క్రాసింగ్ వద్దకు చేరుకోగానే వ్యాన్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను సమీపంలోని హాస్పిటల్ మార్చురీకి తరలించారని ఎస్హెచ్ఓ రాధాకిషన్ మీనా తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మృతులను మనీష్ శర్మ, అతడి భార్య ఇషు, సోదరుడు అమిత్, వ్యాన్ డ్రైవర్ రవిగా గుర్తించారు.
యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ లో నన్ను చంపేయొచ్చు.. - సుప్రీంకోర్టులో ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుడు
ఇదిలావుండగా.. బుధాల్ నుంచి కంది వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో బోల్తా పడింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఫణి ట్రాన్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించామని కంది బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇక్బాల్ మాలిక్ తెలిపారు. మృతులను కేవల్ కు చెందిన షకీల్ అహ్మద్, కందికి చెందిన బదర్ హుస్సేన్ గా గుర్తించారు.
గత నెల 24వ తేదీన కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. నర్సింగ్‌పూర్ జిల్లాలోని లింగ గ్రామంలో డివైడర్‌ను ఢీకొని ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. కరేలీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అఖిలేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు ఓ వివాహం కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో అర్థరాత్రి లింగ గ్రామ సమీపంలోకి చేరుకోగానే రోడ్డుపై ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది.
నాగాలాండ్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలూ.. తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి
ఈ ప్రమాదంలో కార్తీక్ గుర్జార్ (16), పహల్వాన్ సారథే (60), ఉదయరామ్ ఠాకూర్ (55) అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వారి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది. ఈ ప్రమాదంలో మొత్తం 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. స్వల్పంగా గాయపడిన మరికొందరు కరేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. బస్సు రాంగ్ రూట్ లో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
