ఓ కారు లోయలో పడటంతో అందులో ఉన్న నలుగురు చనిపోయారు. ఓ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. స్థానికుల సాయంతో బాలికను పోలీసులు రక్షించారు. మృతదేహాలను బయటకు తీసుకొచ్చి పోస్టుమార్టం కోసం తరలించారు. 

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడటంతో పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రుడిని రక్షించారు. 

పొలంలో నాట్లు వేస్తుండగా తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ.. నలుగురు మహిళలు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

వివరాలు ఇలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని రాంపూర్ లో బుధవారం ఉదయం ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో షాలున్ కైచీ సమీపానికి చేరుకోగానే ఓ లోతైన లోయలో పడిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు స్థానికులు కూడా అక్కడికి వచ్చారు.

స్థానికుల సాయంతో కారులో ఇరుక్కొని ప్రాణాలతో ఉన్న బాలికను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు గుర్తించారు. గాయపడిన బాలికను సమీపంలోని హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లామని రాంపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జైదేవ్ సింగ్ తెలిపారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు.

Scroll to load tweet…

హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో రెండు రోజుల క్రితం ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులపై రాకపోకలు స్తంభించాయి. కొండ ప్రాంతాల్లో వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణికులు మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు కోరారు.

కాగా.. ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో ఈ నెల 22వ తేదీన చోటు చేసుకుంది. పితోర్‌ఘర్ జిల్లాలో గత గురువారం ఉదయం ఓ కారు అదుపుతప్పి 600 మీటర్ల లోయలో పడటంతో తొమ్మిది మంది మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మున్సియారీ ప్రాంతంలోని హోకారా గ్రామంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

బీహార్ లో కూలిన మరో వంతెన.. ఒకే నెలలో ఇది మూడో ఘటన

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్) బృందం కూడా ప్రమాద స్థలానికి బయలుదేరింది. బగేశ్వర్ జిల్లాలోని సామా గ్రామం నుండి యాత్రికులు హోక్రాలోని కోకిలా దేవి ఆలయానికి వెళుతుండగా ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని దీదీహత్ ఎస్‌డీఎం అనిల్ కుమార్ శుక్లా తెలిపారు.