Bharuch: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, రెండేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బుధవారం భరూచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వర్గాలు తెలిపాయి.
Gujarat road accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, రెండేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బుధవారం భరూచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో బుధవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం హన్సోట్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండేళ్ల బాలుడితో సహా మొత్తం ఆరుగురు ఒకే కారులో భరూచ్ నుంచి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని హన్సోత్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కరణ్‌సిన్హ్ చుడాసామా తెలిపారు.
ఈ ప్రమాదంలో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మరో కారు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయనీ, మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు. మృతుల్లో వృద్ధ దంపతులు ఇంతియాజ్ పటేల్, ఆయన భార్య సల్మాబెన్, వారి వివాహిత కుమార్తెలు మారియా, అఫిఫా, ఇంతియాజ్ పటేల్ సోదరుడు జమీలా పటేల్ భార్య ఉన్నారు. వీరంతా భరూచ్ లో నివాసితులనీ, సూరత్ వైపు వెళ్తున్నారని అధికారులు తెలిపారు.
మరియా పటేల్ కుమారుడైన మైనర్ బాలుడు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్వల్ప గాయాలైన అతన్ని స్థానిక పోలీసులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారనీ, 50 ఏళ్ల వయసున్న ఇంతియాజ్ పటేల్ కారు నడుపుతున్నారని, ప్రమాద సమయంలో సీటు బెల్ట్ కూడా ధరించారని తెలిపారు.
"హితేంద్రసిన్హ్ అనే వ్యక్తి నడుపుతున్న ఓ కారు సూరత్ నుంచి భరూచ్ వైపు వెళ్తుండగా పటేల్ కుటుంబం వ్యతిరేక దిశలో వెళ్తోంది. హాన్సోత్ సమీపంలో రహదారి నిటారుగా ఉంటుంది. ఎటువంటి ప్రమాదకరమైన మలుపులు లేవు. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో పటేల్ తన కారుపై నియంత్రణ కోల్పోయి నేరుగా ఎదురుగా ఉన్న సందులోకి వెళ్లినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని" తెలిపారు. ప్రమాద సమయంలో రెండు కార్ల ఎయిర్ బ్యాగులు సక్రమంగా పని చేసినప్పటికీ పటేల్ కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, హితేంద్రసిన్హ్, చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు.
