పశ్చిమ బెంగాల్ లోని పురులియాలో  సాధువులపై  దాడి జరిగింది. టీఎంసీ గూండాలు ఈ దాడికి పాల్పడ్డారని  వీహెచ్‌పీ ఆరోపించింది. 

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పురులియాలో సాధువులపై జరిగిన దాడిని వీహెచ్‌పీ తీవ్రంగా ఖండించింది. బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీహెచ్‌పీ మండిపడింది. ఈ దాడికి టీఎంసీ క్షమాపణ చెప్పాలని విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. హిందూ సాధువులపై టీఎంసీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్న తీరును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించలేమని వీహెచ్‌పీ పేర్కొంది.

గంగాసాగర్ కు వెళ్తున్న సాధువులపై టీఎంసీ గూండాలు దాడికి పాల్పడ్డారని వీహెచ్‌పీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ చెప్పారు. బెంగాల్ లోని ప్రతి మూలలో కాళీ మాత నివసిస్తుందన్నారు. బెంగాల్ భూమి స్వామి వివేకానంద మొదలుకొని అనేక ఆధ్యాత్మిక గురువులను ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. కొద్దిపాటి ముస్లిం ఓట్ల కోసం మమత బెనర్జీ బెంగాల్ లో హిందూ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించిందని ఆయన ఆరోపించారు.ఇది చాలా దురదృష్టకరమన్నారు. కాళీమాత విగ్రహాలను కూడ ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Scroll to load tweet…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు సాధువులు మకర సంక్రాంతికి నాడు గంగాసాగర్ లో స్నానం చేయడానికి వెళ్తున్నారు. పురులియాలో సాధువులపై దాడి జరిగింది. దారితప్పిన సాధువులు పురూలియాకు చేరుకున్నారు. గంగాసాగర్ కు వెళ్లే అడ్రస్ గురించి వాకబు చేస్తున్న క్రమంలో అనుమానించి వారిపై దాడి చేసినట్టుగా వీహెచ్ పీ ఆరోపిస్తుంది.