Asianet News TeluguAsianet News Telugu

కరోనా వేళ రంజాన్ ఉపవాసం.. మరిన్ని పెరగనున్న కేసులు..?

 రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు. దీంతో.. వారిపై కరోనా ఎటాక్ చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.  ఈ క్రమంలో.. ఈ ఆందోళనలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రంజాన్ అడైజరీ స్పందించింది. రంజాన్ ఉపవాసంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేసింది.

Fasting wont spread covid says WHO's Ramzan advisory
Author
Hyderabad, First Published Apr 12, 2021, 9:42 AM IST

కరోనా దేశంలో కోరలు  చాచుతోంది. ఊహించని రీతిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో రంజాన్ మాసం వస్తుండటంతో.. ఇంకా కేసులు పెరిగిపోతాయేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు. దీంతో.. వారిపై కరోనా ఎటాక్ చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.  ఈ క్రమంలో.. ఈ ఆందోళనలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రంజాన్ అడైజరీ స్పందించింది. రంజాన్ ఉపవాసంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేసింది.

రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల కరోనా వ్యాప్తి చెందనని డబ్బ్యూహెచ్ఓ తెలిపింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఉపవాసం చేసుకోవచ్చని.. దానిలో ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొంది.

ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నోటీసు కూడా దీనిపై విడుదల చేసింది. కొందరికి కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటివారు కూడా రంజాన్ వేళ ఉపవాసం చేయవచ్చని పేర్కొన్నారు. అయితే.. ఉపవాస వేళ.. కరోనా లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తే మాత్రం.. వారు దానిని బ్రేక్ చేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఉపవాస సమయంలో కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని.. అది న్యూట్రిషన్ సప్లమెంటరీ కిందకు రాదని పేర్కొన్నారు.

ఉపవాసం చేయడం వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. రంజాన్ ఉపవాస సమయంలోనూ వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించరని.. ముస్లిం పెద్దలు సైతం ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చూపించరని వారు పేర్కొన్నారు.

అయితే.. కరోనాని నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నియమాలు పాటించాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ.. వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios