న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర్ భారత్ లో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నెల 14వ తేదీన మోడీ మన్ కీ బాత్ లో ప్రసంగించిన విషయం తెలిసిందే.ఈ నెల 28వ తేదీన షహీద్ భగత్ సింగ్ జయంతి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మోడీ ఆయన సేవలను గుర్తు చేసుకొన్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి.ఈ సమయంలో రైతుల గురించి మోడీ ప్రసంగించడం ప్రాధాన్యత సంతరించుకొంది. 

రైతులను చూసి ఇండియా గర్వపడుతోందని ఆయన చెప్పారు. కరోనా సమయంలో రైతులు చాలా నష్టపోయారని ఆయన చెప్పారు. అయినా కూడ వారంతా వ్యవసాయాన్ని వదల్లేదని ఆయన చెప్పారు. రైతులు ప్రతి ఏటా 10 నుండి 12 లక్షలను కూరగాయలు పండించడం ద్వారా సంపాదిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 

దోసకాయ, మొక్కజొన్న వంటి పంటలను తాము కోరుకొన్న వారికి విక్రయించే అధికారం వారికి ఉంటుందన్నారు. (ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడి నుండి విక్రయించే అవకాశం దక్కుతోంది)

పండ్లు, కూరగాయాలు గతంలో వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తుల పరిధిలోకి రాని విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రానికి చెందిన రైతు సోనెపట్ ఉదహరణను ఆయన  ప్రస్తావించారు.

లక్నోలో ఇరాడా రైతు ఉత్పత్తిదారులు .. రైతును మధ్యవర్తుల నుండి విముక్తి చేసి వారి పంటను తమ ఇష్టమొచ్చిన ధరకు విక్రయించే స్వాతంత్ర్యం ఇస్తోందన్నారు. వ్యవసాయం మరింత లాభసాటిగా ఉండేందుకు వీలుగా టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

నాలుగేళ్ల క్రితం ఈ సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆయన ప్రస్తావించారు.

ప్రపంచం మొత్తం ఇండియా సైనికుల ధైర్యం, శౌర్యాన్ని చూసిందన్నారు. ఇండియా కీర్తీని, గౌరవాన్ని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ ఎంతటి సాహాసానికైనా దిగుతోందని ఆయన కొనియాడారు.

కరోనా వైరస్ నుండి రక్షించుకొనేందుకు గాను భౌతిక దూరం, మాస్క్ ధరించడాన్ని కచ్చితంగా పాటించాలని ప్రధాని మరోసారి  సూచించారు.