ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు రైతు సంఘాల నేతలు. కాసేపట్లో రైతులతో 8వ విడత కేంద్రం చర్చలు జరుపుతోంది. 40 రైతు సంఘాల నేతలు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రద్దు కాకుండా ఏదైనా ఓకే అంటోంది కేంద్రం. చర్చలకు ముందుకు అమిత్ షాతో సమావేశమయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తోమర్. చర్చల్లో పురోగతి వుంటుందనే ఆశాభావంతో వున్నామని.. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయనే విశ్వాసంతో వున్నామన్నారు తోమర్.  

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సింఘు సరిహద్దు ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే పలుసార్లు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నారు