Asianet News TeluguAsianet News Telugu

బర్రె పాలు ఇవ్వడం లేదని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన రైతు.. ఆయన ఫిర్యాదు వింటే షాక్

మధ్యప్రదేశ్‌లో ఓ రైతు తన బర్రెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. తన బర్రె కొద్ది రోజులుగా పాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. ఇందుకు చేతబడే కారణమని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు షాక్ తిన్నారు. కానీ, వెటెరినరీ సూచనలతో రైతుకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సూచనలు వర్కవుట్ కావడంతో మరో రోజు రైతు పోలీసు స్టేషన్‌కు వచ్చి ధన్యవాదాలు చెప్పారు.
 

farmer went police station along with buffalo complained it is not giving milk
Author
Bhopal, First Published Nov 14, 2021, 6:44 PM IST

భోపాల్: Madhya Pradeshలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన బర్రె Milk ఇవ్వడం లేదని ఓ Farmer ఏకంగా Police stationకే వెళ్లాడు. ఒక్కడే కాదు.. Buffaloనూ వెంట తీసుకెళ్లాడు. పోలీసుల ముందు బోరుమన్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు తన బర్రె బ్రహ్మాండంగా పాలు ఇచ్చేదని, కానీ, కొన్ని రోజుల నుంచి పొదుగు దగ్గరకు కూడా తనను వెళ్లనివ్వడం లేదని చెప్పాడు. తన బర్రె వింత ప్రవర్తనకు కారణంగా చేతబడి అని సందేహిస్తున్నట్టు వివరించాడు. పోలీసులు వారించే ప్రయత్నం చేసినా ఆయన అంగీకరించలేదు. తన బర్రెకు చేతబడి చేశారనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఏం చర్యలు తీసుకోవాలా? అని పోలీసులు ఒక దశలో డైలామాలో పడిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్ విచిత్రమైన రాష్ట్రంగా ఉన్నదని, బర్రె పాలు ఇవ్వడం లేదని ఓ రైతు పోలీసు స్టేషన్‌కు వెళ్లాడని ఓ వ్యక్తి పోస్టు చేశాడు. ఆ గ్రామస్తుడిని బాబు లాల్ జాతవ్‌గా గుర్తించారు. 

మధ్యప్రదేశ్‌లోని భీండ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాబులాల్ జాతవ్ శనివారం నాయాగావ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తన బర్రెనూ వెంట తీసుకెళ్లాడు. తన బర్రె కొంత కాలం నుంచి పాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అరవింద్ షా తెలిపారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు అవాక్కయ్యారు. విషయమేంటని ఓపికగా ఆరా తీశారు. 

Also Read: గుప్తనిధి కనబడాలంటే.. నా ముందు స్త్రీని నగ్నంగా కూర్చోబెట్టాలి.. పూజారి ఘాతుకం...

తన బర్రె పాలు ఇవ్వడం లేదని కొందరితో మాట్లాడారని బాబులాల్ జాతవ్ అన్నాడు. అయితే, తమ గ్రామస్తుల్లోనే కొందరు తనతో మాట్లాడుతూ, బర్రెకు ఎవరో చేతబడి చేసి ఉంటారని చెప్పినట్టు వివరించాడు. తనకూ అది నిజమే అనిపిస్తున్నదని చెప్పాడు. అందుకే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు తెలిపాడు. ఫిర్యాదు ఇచ్చిన నాలుగు గంటల తర్వాత ఆ రైతు మళ్లీ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. మళ్లీ తన బర్రె పాలు ఇవ్వడం లేదని, తనకు సహకరించాల్సిందిగా పోలీసులను కోరాడు.

Also Read: యువతి ఆత్మహత్య.. మూఢనమ్మకం పేరిట..!

డీఎస్పీ అరవింద్ షా మాట్లాడుతూ, వెటెరినరీ వైద్యుడి సూచనలు తీసుకుని ఆ రైతుకు సహకరించాల్సిందిగా పోలీసు స్టేషన్ ఇంచార్జీకి సూచించినట్టు వివరించారు. వెటెరినరీ డాక్టర్ ఇచ్చిన సూచనలనే ఆ రైతుకు చెప్పారని పేర్కొన్నారు. మళ్లీ ఈ రోజు ఆ రైతు పోలీసు స్టేషన్‌కు వచ్చాడని చెప్పారు. అయితే, ఈ సారి పోలీసులకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడని వివరించారు. ఇప్పుడు తన బర్రె పాలు పితకడానికి సహకరిస్తున్నదని, ఆదివారం ఉదయం బర్రె పాలు ఇచ్చినట్టు చెప్పి సంతోషం వ్యక్తం చేశాడని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios