ఓ వ్యక్తి ఇంట్లోని ఏసీలో దాదాపు 40 పాము పిల్లలు భయటపడ్డాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతుకు చెందిన ఏసీలో పాము కాపురం పెట్టింది. ఏకంగా 40 పాము పిల్లలు చూసి వారు భయంతో వణకి పోయారు.

వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన సోమవారం రాత్రి కంకర్‌ఖేరా పోలీసు స్టేషన్ పరిధిలోని పావ్లీ ఖుర్ద్ గ్రామంలో జరిగింది. అనే రైతు తన ఇంట్లో ముందు నేలమీద ఒక పాము పిల్లను చూశారు. దాన్ని తీసి అవతల పారేశారు. కొద్దిసేపటి తరువాత, నిద్రించేందుకు తన గదికి వెళ్లేసరికి మంచం మీద మరో మూడింటిని చూశారు. దీంతో ఏసీని  ఓపెన్ చేసి మరింత నిశితంగా పరిశీలించినపుడు ఏసీ పైపులో 40 పాము పిల్లలను చూసి షాక్ అయ్యారు. 

ఈ వార్త వ్యాపించడంతో స్థానిక ప్రజలు శ్రద్ధానంద్ ఇంటి వద్ద గుమిగూడారు. చివరకు స్థానికుల సహాయంతో, రైతు వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చాలా కాలంగా ఏసీ వాడకపోవడం,  లేదా సర్వీసింగ్ చేయకపోవడంతో పాములు గుడ్లు పెట్టి ఉండవచ్చని,  ఆ గుడ్ల నుంచి పిల్ల‌లు ఇపుడు బ‌య‌ట‌కు వచ్చాయని స్థానిక పశువైద్యుడు వత్సల్  అభిప్రాయపడ్డారు.