సీరియల్ కిల్లర్.. హత్యకు ముందు పూజలు చేస్తాడు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 21, Nov 2018, 12:30 PM IST
Faridabad - serial killer jagtar first chanted kali 108 times chanting and then kills
Highlights

ఏడుగురు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ ని హర్యానా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 

ఏడుగురు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ ని హర్యానా పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన జగ్తార్ సిన్హా గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నాడు.

కాగా.. వరసగా ఏడుగురిని దారుణంగా హత్య చేశాడు.  ఎప్పటి నుంచి ఇతని కోసం వెతుకుతున్న పోలీసులకు తాజాగా అనూహ్యంగా పోలీసులకు  చిక్కాడు. అయితే.. పోలీసుల విచారణలో తన తప్పులను అంగీకరించిన జగ్తార్... కొన్ని విషయాలను పోలీసులకు తెలిపాడు.

ఆ విషయాలు విని పోలీసులు కూడా షాకయ్యారు. జగ్తార్ ఇప్పటి వరకు ఏడుగురిని హత్య చేయగా.. హత్యకు ముందు కాళీమాతకు పూజలు చేస్తాడట. తాను హత్య చేయబోతున్నానని.. తాను చేసే పాపాల నుంచి ప్రాయశ్చితం కలిగించాలని మాతను కోరుకుంటాడట. అంతేకాదు..కాళీమాత 108 మంత్రాలతో పూజలు, జపాలు కూడా చేస్తాడట.

హత్య చేయడానికి ముందు కచ్చితంగా పూజ చేస్తాడట. పూజ తర్వాత హత్యకు పథకం పన్నుతానని అతను పోలీసుల విచారణలో అంగీకరించాడు.  ఫరీదాబాద్, పల్వాల్, కురక్షేత్ర, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఈ హత్యలు చేసినట్లు నిందితుడు తెలిపాడు.  కాగా.. అతనిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

loader