Asianet News TeluguAsianet News Telugu

మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకొంటానని యువతి బెదిరింపు: కాపాడిన పోలీసులు

ఫరీదాబాద్ మెట్రో రైల్వస్టేషన్ లో ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించిన యువతిని పోలీసులు కాపాడారు. మాటల్లో దించి ఆమెను  రక్షించారు.ఈ వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.  

Faridabad cops save woman from jumping off metro station, wins internet lns
Author
Faridabad, First Published Jul 25, 2021, 4:38 PM IST

ఫరీదాబాద్: మెట్రో రైల్వే స్టేషన్ లో బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించిన యువతిని పోలీసులు కాపాడారు.శనివారం నాడు సాయంత్రం ఆరున్నర గంటలకు   ఫరీదాబాద్ సెక్టార్ 28 మెట్రో రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.  బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకొంటానని మహిళ హెచ్చరించడంతో పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.

 

ఆ సమయంలో మెట్రో స్టేషన్ లో  ఎస్ఐ ధన్‌ప్రకాష్ ,కానిస్టేబుల్ సర్పరాజ్ లు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన  ఎస్ఐ ధన్‌ప్రకాష్ మెట్రోలో భద్రతాను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను మాటల్లోకి దింపారు.అదే సమయంలో మరో మార్గం గుండా కానిస్టేబుల్ సర్పరాజ్ బాల్కనీ ఎక్కి ఆమె కిందకు దూకకుండా గట్టిగా పట్టుకొన్నారు. సీఐఎస్ఎఫ్ , మెట్రో సిబ్బంది ఆమెను సురక్షితంగా కిందకు దించారు.మహిళ ప్రాణాలను కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు. ఈ వీడియోను ఫరీదాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios