టాయ్ లెట్స్ లేవు, ఫ్యాన్లు పనిచేయవు.. డాక్టర్ల పరిస్థితి.. వీడియో విడుదల

కరోనా రోగులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులకు దగ్గరలోని ఓ ప్రభుత్వ పాఠశాల ను కేటాయించారు. కాగా.. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేక ఇబ్బంది పడ్డారు. 

Fans Toilets Don't Work UP Doctors Release Videos, Government Acts

కరోనా కేసులు దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా రోగులను రక్షించేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ శాయ శక్తులా ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా.. ఆస్పత్రిలోనే ఉంటూ వైద్యం అందిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. వారి ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే.. అంతలా కష్టపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రం కనీస సదుపాయాలు కూడా లభించడం లేదు.

కనీసం వారు ఉండే గదులకు ఫ్యాన్లు కూడా లేవు. కొన్ని ఉన్నా.. అవి పనిచేయడం లేదు. టాయ్ లెట్లు అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ తాము రోగులకు వైద్యం చేయాలా అంటూ ఉత్తరప్రదేశ్ కి చెందిన కొందరు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఈ మేరకు వీడియోలు విడుదల చేశారు.

కరోనా రోగులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులకు దగ్గరలోని ఓ ప్రభుత్వ పాఠశాల ను కేటాయించారు. కాగా.. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేక ఇబ్బంది పడ్డారు. అక్కడి పరిస్థితులను వెంటనే వీడియోలు తీసి వారు ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో అధికారులు కూడా వెంటనే స్పందించడం గమనార్హం.

కాగా.. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో వసతి కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వారిని అక్కడికి తరలించారు. 

వారు విడుదల చేసిన వీడియో ఒక దాంట్లో.. వారు ఉంటున్న గదిని చూపించారు. అందులో ఒకే గదిలో దాదాపు నాలుగు బెడ్స్ ఉన్నాయి. కరెంట్ లేదు... ఫ్యాన్స్ పనిచేయడం లేదు. దారుణ స్థితిలో టాయ్ లెట్స్ ఉన్నాయి. క్వారంటైన్ గదులు అంటే ఇలానే ఉంటాయా అంటూ ఓ డాక్టర్ ఆ వీడియోలో ప్రశ్నించాడు.

ఇక మరో వీడియోలో.. వారికి అందించే ఆహారాన్ని చూపించారు. ఒక పాలిథీన్ కవర్ లో కుప్పలుగా పూరీలు పడేసి ఉన్నాయి. మరో కవర్ లో కూర ఉంది. కరోనా రోగులకు వైద్యం అందించే డాక్టర్లు మీరు పెట్టే ఆహారం ఇదేనా అంటూ వారు ఆ వీడియోలో ప్రశ్నించారు.

కాగా.. బుధవారమే.. వైద్యుల రక్షణ తమ బాధ్యత అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఈ వీడియోలను వైద్యులు విడుదల చేయడం గమనార్హం. దీంతో.. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి.. వారికి వేరే ప్రాంతంలో వసతి కల్పించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios