శవంతో సొంతూరికి: కుటుంబ సభ్యులతోపాటు లిఫ్ట్ ఇచ్చిన మహిళకు కూడా కరోనా

ముంబై నుంచి శవాన్ని తీసుకొని కర్ణాటకలోని మాండ్యకు వచ్చిన ఆరుగురిలో ముగ్గురు కరోనా పాజిటివ్ గా తేలారు. వారు మధ్యలో మరో ఇద్దరికి లిఫ్ట్ ఇచ్చారు. అలా వారు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు తల్లి కొడుకుల్లో తల్లికి కూడా ఈ కొరోనా వైరస్ సోకింది. 

Family Travels With Body From Mumbai, 3 Test Coronavirus positive In Karnataka

ముంబై నుంచి శవాన్ని తీసుకొని కర్ణాటకలోని మాండ్యకు వచ్చిన ఆరుగురిలో ముగ్గురు కరోనా పాజిటివ్ గా తేలారు. వారు మధ్యలో మరో ఇద్దరికి లిఫ్ట్ ఇచ్చారు. అలా వారు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు తల్లి కొడుకుల్లో తల్లికి కూడా ఈ కొరోనా వైరస్ సోకింది. 

వివరాల్లోకి వెళితే ముంబై ఆటో నడుపుకునే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అధికారుల దగ్గర అనుమతులు తీసుకున్న తరువాత ఆరుగురు బంధువులు శవాన్ని తీసుకొని కర్ణాటకలోని తమ సొంత ఊరికి బయల్దేరారు. 

అక్కడ ఆ వ్యక్తి అంత్యక్రియలు పూర్తయిన తరువాత ఆ వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఆ పరీక్షల్లో ముగ్గురు కరోనా పాజిటివ్ గా తేలారు. మరణించిన వ్యక్తి భార్య మాత్రం నెగటివ్ గా తేలారు. 

వారికి కరోనా ఉందని నిర్ధారణ అవడంతో దారిలో ఎవరెవర్ని కలిశారు అని ఆరాతీయగా ఇద్దరికి లిఫ్ట్ ఇచ్చినట్టు చెప్పారు. వారిని వెదికి పట్టుకొని పరీక్షా చేయగా ఆ లిఫ్ట్ అడిగి ఆ అంబులెన్సు లో ఎక్కిన తల్లి కొడుకుల్లో, తల్లికి కరోనా వైరస్ సోకింది. 

మహారాష్ట్ర అధికారులు ఆరుగురిని ఒక శవంతోపాటు వెళ్ళడానికి ఎలా పర్మిషన్ ఇస్తారని మండ్యలోని వైద్య అధికారులు వారిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారులు ఇలా అంటుంటే... ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం కర్ణాటక అధికారుల వైఫల్యమే ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతుందని ఆరోపించారు. 

ఇంతకు వారందరికీ కరోనా ఎలా సోకిందని విషయంలో పూర్తిస్థాయి అవగాహన రాకున్నప్పటికీ... ఆ మరణించిన వ్యక్తి కొడుకు ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి తొలుత కరోనా సోకి ఉండవచ్చని అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

ఇకపోతే ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. అక్కడ  రోజుకి కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు అక్కడినుండి వస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios