Asianet News TeluguAsianet News Telugu

కరోనా మృతుల కుటుంబాలకు రిటైర్మెంట్ వరకు వేతనాలు.. టాటా స్టీల్ దాతృత్వం..

పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూప్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. మొదటిదశలో భాగంగా కరోనా వైరస్ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా  కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే,  వారి కుటుంబాలకు తాము అండగా నిలబడతామని టాటాస్టీల్ ప్రకటించింది.

Family of Tata Steel Employees, Who Died of COVID, to Get Monthly Salary Till Deceased s Retirement Age - bsb
Author
Hyderabad, First Published May 25, 2021, 2:03 PM IST

పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూప్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. మొదటిదశలో భాగంగా కరోనా వైరస్ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా  కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే,  వారి కుటుంబాలకు తాము అండగా నిలబడతామని టాటాస్టీల్ ప్రకటించింది.

సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘టాటా స్టీల్.. తమ ఉద్యోగుల కుటుంబాలకు, వారి మెరుగైన జీవనం సాగించేందుకు తమవంతు సహాయం చేస్తుంది. ఒకవేళ ఆ ఉద్యోగి మరణిస్తే సదరు వ్యక్తి కుటుంబానికి జీతం అందజేస్తాం. ఉద్యోగి మరణించే నాటికి ఎంత మొత్తమైతే వేతనంగా పొందుతున్నారో, అంత మొత్తాన్ని ఆ వ్యక్తికి 60 ఏళ్లు నిండే వరకూ వారి ఫ్యామిలీకి పంపిస్తాం. వైద్య,  గృహ పరమైన లబ్ధి పొందేలా చూసుకుంటాం.

అంతేగాక, ఒకవేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడితే,  పూర్తి స్థాయి జీతంతో పాటు సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్‌(ఇండియాలో) పూర్తి చేసేంతవరకు ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాం’’ అని సోషల్ మీడియా వేదికగా ఆదివారం వెల్లడించింది.

తమ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ కవచంలా నిలుస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా స్టీల్ కంపెనీ యాజమాన్యంపై  ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ సందర్భంగా  టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా దాతృత్వాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios