కరోనా నుంచి కోలుకున్నాడని.. ఘన స్వాగతం..20మందిపై కేసు
వెంటనే పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేసి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంకేముంది వాళ్లందరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. దాదాపు 20మందిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సదరు వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. ఆస్పత్రిలో చేరిన తర్వాత డాక్టర్లు అందించిన చికిత్స తో కోలుకున్నాడు. కోలుకొని ఇంటికి వస్తున్న అతను.. ఏదో ప్రపంచాన్ని జయించినవాడిలా ఫీలయ్యారు అతని కుటుంబసభ్యులు. వెంటనే పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేసి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంకేముంది వాళ్లందరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. దాదాపు 20మందిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ మహానాడుకు వెళ్లి తిరిగొచ్చిన శీర్గాళి సభానాయకర్ వీధికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి కరోనాతో తిరువారూర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందారు. పది రోజుల అనంతరం ఆయన్ను వైద్యులు డిశ్చార్జి చేశారు. శీర్గాళి క్లాక్ టవర్ ప్రాంతానికి చేరుకున్న ఆ వ్యక్తికి బంధువులు, స్నేహితులు శాలువా కప్పి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, వైద్యుల సూచనలు పాటించలేదని వీఏఓ బబిత శీర్గాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు స్వాగత ఏర్పాట్లు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. భారత్ లో ఇప్పటి వరకు 18వేల మందికి పైగా కరోనా సోకింది. అలాగే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 592కు పెరిగింది. మహారాష్ట్రలో మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నలుగు వేల రెండు వందలు దాటిపోయింది. అలాగే మృతుల సంఖ్య 223కు చేరుకుంది.