దీనిని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేయడంతో, మరింత మందికి ఇది చేరువైంది.
మిడిల్ క్లాస్ వారికి ఉండే అతి పెద్ద డ్రీమ్స్ లో కారు కొనడం కూడా ఒకటి. సొంతింటి కల తర్వాత సొంత కారు ఉంటే బాగుండని అనుకుంటూ ఉంటారు. ఆ కల నిజంగా నిజమైనప్పుడు వారు ఆనందంలో మునిగి తేలుతారు. ఓ కుటుంబం కూడా అదే చేసింది. కారు కొన్న తర్వాత ఆనందంతో డ్యాన్సులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేయడంతో, మరింత మందికి ఇది చేరువైంది.
ఈ వీడియోని మొదట కారు న్యూస్ గురు అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ కుటుంబం మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్ యూవీని కొనుగోలు చేశారు. కారు తమ సొంతం కావడంతో ఆనందం తట్టుకోలేక, కారు ముందు డ్యాన్సులు చేశారు. వారి ఆనందం చూసిన వారు ఎవరికైనా ముఖంలో చిరునవ్వులు రావాల్సిందే. కుటుంబం మొత్తం ఆనందంతో డ్యాన్స్ చేశారు.
ఈ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.."భారత ఆటో పరిశ్రమలో పని చేస్తున్నందుకు ఇదే నిజమైన బహుమతి, ఆనందం" క్యాప్షన్ జత చేసి షేర్ చేశారు.
కారు కోసం వారు ఎంత కాలం నుంచి ఎదురు చూశారో, అందుకే అంత ఆనంద పడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.
