Gurugram: గురుగ్రామ్ లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక వ్య‌క్తి ఇంటి తగాదాల కారణంగా భార్య, నాలుగేళ్ల కుమారుడిని మొదటి అంతస్తు నుంచి తోసేశాడు. గురుగ్రామ్ లోని సెక్టార్ 12ఏలో కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ, ఆమె నాలుగేళ్ల చిన్నారిని భర్త, అత్తమామలు క‌లిసి ఇంటి మొదటి అంతస్తు నుంచి తోసేశార‌ని స‌మాచారం. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Gurugram-domestic dispute: గురుగ్రామ్ లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక వ్య‌క్తి కుటుంబ తగాదాల కారణంగా భార్య, నాలుగేళ్ల కుమారుడిని మొదటి అంతస్తు నుంచి తోసేశాడు. గురుగ్రామ్ లోని సెక్టార్ 12ఏలో కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ, ఆమె నాలుగేళ్ల చిన్నారిని భర్త, అత్తమామలు క‌లిసి ఇంటి మొదటి అంతస్తు నుంచి తోసేశార‌ని స‌మాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకునీ, దర్యాప్తు చేస్తున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. హ‌ర్యానాలోని గురుగ్రామ్ లో సెక్టార్ 12ఏలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళను, ఆమె నాలుగేళ్ల చిన్నారిని ఆమె భర్త, అత్తమామలు క‌లిసి ఇంటి మొదటి అంతస్తు నుంచి తోసేశార‌ని ఇండియా టూడే క‌థ‌నం పేర్కొంది. సంబంధిత నివేదిక‌లు ప్ర‌కారం.. ఇంటి మొద‌టి అంత‌స్తు నుంచి తోసేసిన త‌ర్వాత వారు నెల‌ను ఢీకొనే ముందు మహిళ, చిన్నారి ఒడిలో చిక్కుకోవడం అదృష్టమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చిన్నారికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, మహిళకు తీవ్ర‌ గాయాలు అయ్యాయ‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం ఇరువురు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలిని సోనేపట్ కు చెందిన కోమల్ సైనీగా గుర్తించారు. తన భర్త తేజేశ్వర్ సైనీ, అత్తమామలు తనపై హత్యాయత్నం చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోమల్ భర్త, అత్త సరోజ్ సైనీ, బావమరిది హరీష్, మరదలు రీనా తదితరులు తనను వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌న‌పై జ‌రుగుతున్న హింస‌ను ఆపమని ఆమె అడిగినప్పుడు తేజేశ్వర్ చెంపదెబ్బ కొట్టాడనీ, తన జుట్టును ప‌ట్టుకుని ఈడ్చిప‌డేశాడ‌ని కోమల్ తెలిపింది.

ఆ త‌ర్వాత వెంటనే వారు త‌న‌ను కొట్టడం ప్రారంభించారనీ, ఈ క్ర‌మంలోనే పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా వారు త‌న చేతిలోని మొబైల్ లాక్కున్నారని తెలిపారు. అలాగే, ప‌దునైన ఆయుధంతో త‌న తలపై కూడా కొట్టడానికి ప్రయత్నించార‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత త‌న‌తో పాటు త‌న నాలుగేళ్ల కుమారుడిని మొదటి అంతస్తు నుంచి తోసేశారని కోమల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సెక్టార్ 5ఏ పోలీస్ స్టేషన్లో ఆమె భర్త, అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 323 (గాయపరచడం), 307 (హత్యాయత్నం), 506 (క్రిమినల్ బెదిరింపు), 34 (ఉమ్మడి ఉద్దేశం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామనీ, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్సై సుభాష్ సింగ్ తెలిపారు.