సుమారు ఏడాది పాటు సాగిన నిరసనకు రైతులు ముగింపు పలికారు. నూతే చ్యవాసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రైతులు టిక్రి, సింఘి ప్రాంతాల నుండి తమ స్వస్థాలకు బయలుదేరారు.
న్యూఢిల్లీ: New Farm laws రద్దు చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి Narendra Modi ప్రకటించిన మూడు వారాల తర్వాత రైతులు ఢిల్లీకి సమీపంలోని Singhu సరిహద్దు నుండి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఆమోదం తెలిపాయి.ఈ బిల్లులకు ఇటీవలనే రాష్ట్రపతి Ramnath Kovind కూడా ఆమోదం తెలిపారు. దీంతో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు కావడంతో రైతులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు.
Tikri , సింఘి సరిహద్దుల్లో Farmers ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సుమారు ఏడాది కాలంగా రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసమే తాము ఈ మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ కొత్త చట్టాలతో రైతులకు తీవ్ర నష్టమని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.ఈ చ,ట్టాలను రద్దు చేయాలని ఆందోళన సాగిస్తున్నారు.ఈ ఆందోళనకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేసింది. రైతు సంఘాలు తమ ఆందోళనలను విరమించి ఇవాళ్టి నుండి సింఘు, టిక్రీ సరిహద్దుల నుండి ఖాళీ చేస్తున్నారు.
also read:నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు:రాష్ట్రపతి ఆమోదం
టిక్రి నిరసన ప్రదేశంలో రైతులు తాము వేసుకొన్న తాత్కాలిక గుడారాను కూల్చివేశారు. వారి వస్తువులను ప్యాక్ చేసుకున్నారు. అంతేకాదు పేదలకు విరాళంగా ఇవ్వాల్సిన వస్తువులను తీసుకోవడంలో రైతులు ఎక్కువ సమయం కేటాయించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు ఏడాది పాటు తమ నిరసన ప్రదేశంలోని జ్ఞాపికలను తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు. మట్టిని చిన్న ప్లాస్టిక్ జాడిలో ప్యాక్ చేశారు. నిరసన కరపత్రాలను సురక్షితంగా బ్యాగుల్లో తీసుకెళ్లారు.15 నెలల సుదీర్ఘ నిరసనకు ముగిసింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 32 ఏళ్ల
మంజిత్ సింగ్ అనే వ్యక్తి నిరసనకారులను తమ స్వస్థలాలకు తరలించడానికి 52 ట్రిప్పుల బస్సులను ఏర్పాటు చేశాడు. నిరసన ప్రదేశం నుండి రైతులు ఖాఖీ చేయడానికి కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుందని బీకెయూ నేత రాకేష్ తికాయత్ చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు తాత్కాలిక టెంట్లు ఏర్పాట్లు చేసుకొని సుదీర్ఘ కాలం పాటు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమం రాజకీయంగా బీజేపీకి కొంత ఇబ్బంది కల్గించింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకొందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తాము నిరసన తెలిపేందుకు వచ్చిన సమయంలో టాయిలెట్లు, లైట్లతో పాటు అవసరమైన సామాగ్రిని అందించిన స్థానిక దుకాణ యజమానులకు రైతు సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. గురు, శుక్రవారాల్లో నిరసనకారులు తమకు సహకరించిన వారి వద్దకు వెళ్లి ధన్యవాదాలు చెప్పారు.పంజాబ్, హర్యానా నుండి వచ్చిన రైతులు నిరసన స్థలాన్ని ఖాళీ చేశారు. ట్రాక్టర్లలో తమ స్వగ్రామాలకు వెళ్తూ నిరసన స్థలంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల వైపు చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు.
