Fact Check : అంబేద్కర్ మద్యం సేవించి రాజ్యాంగం రాశారని కేజ్రీవాల్ అన్నారా?

డిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ ను అవమానించారా? భారత రాజ్యాంగం రాసేటప్పుడు మద్యం సేవించారని అన్నది నిజమేనా?  

Fact Check Arvind Kejriwal Comment on Dr Ambedkar and Indian Constitution AKP

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ ను అవమానించారనే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో అంబేద్కర్ మద్యం సేవించారని కేజ్రీవాాల్ అంటున్నట్లుగా ఆ వైరల్ వీడియోలో వుంది. అయితే ఈ వీడియో ఫేక్ ది గా తెలుస్తోంది.

ఈ వీడియో ఎప్పటిదో... కేజ్రీవాల్ వేరే వీడియోను ఎడిట్ చేసారు. అందులో కేజ్రీవాల్ డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగం గురించి కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడారు. దీన్ని మార్చి డా. అంబేద్కర్ గురించి మాట్లాడినట్లు సృష్టించారు. 

తొమ్మిది సెకన్ల నిడివి గల ఈ వైరల్ వీడియోతో నెటిజన్లను తప్పుదారి పట్టిస్తోంది... కేజ్రీవాల్ పై బురదజల్లేలా క్యాప్షన్‌తో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు నిజంగానే అంబేద్కర్ ను కేజ్రీవాల్ ఇలా అన్నారనుకుని నమ్మి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొంతమంది మహనీయుడు అంబేడ్కర్ గురించి అలాంటి ప్రకటన చేసినందుకు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  

కొన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ దళిత నాయకుడు అంబేద్కర్ నే కాదు యావత్ దళిత సమాజాన్ని కించపర్చాడని అంటున్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ పేరుతో వున్న ఎక్స్ పేజీలో అయితే కేజ్రీవాల్ ను 'చోటా సంఘీ' అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసారు.   

 

కేజ్రీవాల్ అసలు వీడియో ఇదే

ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతున్న కేజ్రీవాల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియోను పరిశీలించిన పోలీసులు ఇది ఫేక్ వీడియోగా నిర్దారించారు. అసలు వీడియోలో కేజ్రీవాల్ భారత రాజ్యాంగం గురించి కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నట్లు వుంది. 

సుమారు 22 సెకన్ల ఈ వీడియోలో పార్టీ సభ్యులు ఎవరూ మద్యం సేవించకూడదనే నిబంధన గురించి చర్చిస్తున్నట్లు వుంది. “కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏ కార్యకర్త మద్యం సేవించకూడదని చెబుతోంది. ఈ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి దాన్ని రాస్తున్నప్పుడు మద్యం సేవించి ఉంటాడని అన్నారు” అని ఆయన హాస్యంగా వ్యాఖ్యానించారు. దీన్ని భారత రాజ్యాంగం గురించి మాట్లాడినట్లు ఎడిట్ చేసారు. 

12 సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ యూట్యూబ్ ఛానెల్‌లో అసలు వీడియో వుంది. ఈ వీడియోలో కేజ్రీవాల్ ఆప్ రాజ్యాంగాన్ని ప్రత్యేకమైనదిగా అభివర్ణిస్తూ, దానిని పార్టీ వెబ్‌సైట్‌లో చదవమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆప్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల రాజ్యాంగాలతో పోల్చి, మద్యం సేవించడం గురించి వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అరవింద్ కేజ్రీవాల్ పాత ప్రసంగంలోంచి ఎడిట్ చేయబడిన క్లిప్. భారత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు డాక్టర్ అంబేడ్కర్ మద్యం సేవించారని ఆయనకు ఆపాదించబడిన ప్రకటన అవాస్తవం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios