Pratapgarh: ఎంతో ప్రేమగా చూసుకునే భర్త తన భార్య కలను సాకారం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. అయితే, చివరికి కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది ఆ భార్య. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తన అసలు రంగును చూపిస్తూ.. భర్తను కేసులో ఇరికించి, మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Uttar Pradesh: ఎంతో ప్రేమగా చూసుకునే భర్త తన భార్య కలను సాకారం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. అయితే, చివరికి కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది ఆ భార్య. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తన అసలు రంగును చూపిస్తూ.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, కేసులో ఇరికించి భర్తను మోసం చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. యూపీలోని ప్రయాగ్ రాజ్ లోని ధూమన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝల్వా ప్రాంతానికి చెందిన అలోక్ కుమార్ మౌర్యకు వారణాసిలోని చిరైగావ్ కు చెందిన జ్యోతి మౌర్యతో 2010లో వివాహం జరిగింది. వివాహ సమయంలో అలోక్ పంచాయతీరాజ్ శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పోస్టింగ్ ప్రతాప్ గఢ్ జిల్లాలో ఉంది. భార్య జ్యోతి మౌర్య తాను ఇంకా చదువుకుంటాననీ, ప్రభుత్వ ఉద్యోగం సాధించడం తన కల అని తన కోరికను భర్తతో చెప్పింది. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త తన భార్య కలను సాకారం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. అలోక్ తన భార్యతో కలిసి ప్రయాగ్ రాజ్ కు వచ్చి ఇక్కడ సివిల్ ప్రిపరేషన్ కు కోచింగ్ తీసుకున్నాడు. 2016లో యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పీసీఎస్ పరీక్షలో జ్యోతి మౌర్య 16వ స్థానం సాధించి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.
జ్యోతి మౌర్య కూడా ప్రయాగ్ రాజ్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తుండగా, ప్రస్తుతం ఆమె బరేలీ జిల్లాలోని షుగర్ మిల్లులో జీఎంగా పనిచేస్తున్నారు. దీనికి ముందు జ్యోతి మౌర్యను కౌశాంబి, ప్రతాప్ గఢ్, జౌన్ పూర్, లక్నో జిల్లాల్లో నియమించారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక తన అసలు రంగును బయటపెడుతూ.. భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త అకోక్ కుమార్.. భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, ఎదురుతిరిగి భార్య పీసీఎస్ అధికారి జ్యోతి మౌర్య తన భర్త అలోక్ మౌర్య, అత్తమామలపై 7 మే 2023న ధూమన్గంజ్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన అలోక్ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. ఎంతగానో ప్రేమించిన తన భార్య ఇలా తనను మోసం చేస్తుందని కలలో కూడా ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ అలోక్ కూమార్ ఆరోపించారు.
ఇప్పుడు తన ఉద్యోగం కూడా పోయిందనీ, ఉపాధిలేక రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆమె తన పై ఆఫీసర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఇద్దరూ కలిసి బెదిరిస్తున్నారనీ, తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించాడు. ఘజియాబాద్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని మహిళా అధికారి భర్త అలోక్ కుమార్ మౌర్య ఆరోపించారు. ఫిబ్రవరి నెలలో తన భార్య అధికారిక నివాసంలో వారిద్దరినీ అభ్యంతరకర స్థితిలో పట్టుకున్నానని చెప్పాడు. అప్పటి నుంచి అతని భార్య, ఆమె ప్రియుడు అతని జీవితానికి శత్రువులుగా మారారు. తనకు విడాకులు ఇవ్వాలని భార్య ఫోన్ లో బెదిరిస్తోందనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడని భర్త ఆరోపించాడు. తనకు ఏదైనా ఏమైనా జరిగితే తన భార్య జ్యోతి మౌర్య, ఆమె ప్రియుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని అలోక్ తెలిపినట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.
