అదనపు కట్నం కోసం ఓ భర్త అత్యంత నీచానికి దిగాడు. అదనపు కట్నం తీసుకురాకపోతే.. అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. 

అదనపు కట్నం కోసం ఓ భర్త అత్యంత నీచానికి దిగాడు. అదనపు కట్నం తీసుకురాకపోతే.. అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. చెన్నై కల్పాకానికి చెందిన ముబారక్ అహ్మద్‌ కుమార్తె సంగమ్ హస్మీకి.. మధురైకి చెందిన అల్లావుద్దీన్ ఆసిక్‌తో గత ఏడాది జనవరిలో వివాహం జరిగింది.

వివాహ సమయంలో 140 సవర్ల బంగారం, కారు కట్నంగా ఇచ్చారు. అనంతరం అల్లుడు వ్యాపారం ప్రారంభిస్తున్నానంటే.. సంగమ్‌షేక్ దౌత్ రూ.25 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆసిక్‌ అక్కడితో ఆగకుండా సంగమ్‌హస్మీ ధరించిన నగలను కూడా లాక్కొన్నాడు.

అది చాలదన్నట్లు మరింత అదనపు కట్నం తేవాలని ప్రతిరోజు భార్యను హింసించేవాడు. ఆమెను అశ్లీలంగా వీడియో తీసి అదనపు కట్నం తీసుకురాకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

భర్త వేధింపులు భరించలేకపోయిన సంగమ్.. ఉగాండాలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ వ్యవహారంపై చెన్నైలో ఉన్న సంగమ్‌షేక్‌దౌత్ తమ్ముడు ముబారక్ అహ్మద్ మధురై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అల్లావుద్దీన్ అసిక్‌తో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.