శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు.  ఈ ఘటనపై శ్రీలంకలోని భారత హైకమిషనర్‌తో మాట్లాడామని చెప్పారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సుష్మ తెలిపారు.

భారతీయుల కోసం కొలంబోలోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు శ్రీలంకలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. +94 777903082, +94112422788, +94 112422789, +94 777902082, +94772234176 నంబర్లను సంప్రదించాలని కోరింది.