న్యూఢిల్లీ:గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ కేశుభాయ్ పటేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ విషయం తెలిందే.

మా ప్రియమైన  గౌరవనీయమైన కేశుభాయ్ పటేల్ మరణించడంతో తాను చాలా బాధపడ్డానని ఆయన చెప్పారు. అతను సమాజంలోని ప్రతి వర్గాన్ని చూసుకొనే నాయకుడని ఆయన గుర్తు చేశారు. అతని జీవితం గుజరాత్ పురోగతి, ప్రతి గుజరాతీ సాధికారికత కోసం అంకితం చేయబడిందన్నారు. 

జనసంఘ్, బీజేపీలను బలోపేతం చేయడానికి కేశుభాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆయన జైలు జీవితాన్ని గడిపిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

also read:గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూత

రైతుల సంక్షేమం కోసం  ఆయన అనేక కార్యక్రమాలను తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం అయినా కూడ ఆయన రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకొన్నారని చెప్పారు. 

 

కేశుభాయ్ పటేల్ తనతో సహా అనేక మంది చిన్న చిన్న కార్యకర్తలను చేరదీసి వారిని నాయకులుగా తీర్చిదిద్దారన్నారు.ప్రతి ఒక్కరూ అతని స్నేహా పూర్వక స్వభావాన్ని ఇష్టపడేవారని చెప్పారు. ఆయన మరణం కోలుకోలేని నష్టంగా పేర్కొన్నారు.పటేల్ మరణించిన విషయం తెలిసిన తర్వాత తన మనసంతా కన్నీటితో నిండిపోయిందన్నారు.