గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ గురువారం నాడు మరణించాడు. ఆయన వయస్సు 92 ఏళ్లు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. 

కేశుబాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1995లో బాధ్యతలు చేపట్టారు. 1998 నుండి 2001 వరకు రెండోసారి కూడ ఆయన ఈ భాద్యతలు నిర్వహించారు. ఆరుసార్లు ఆయన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012లో ఆయన బీజేపీని వీడారు.

1945లో ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరారు.  స్వయం సేవక్ లో ఆయన ప్రచారక్ గా పనిచేశారు. 1975లో  ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలుకు వెళ్లారు.
2012లో ఆయన విసోదర అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. 2014లో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 1978 నుండి  కలవాడ్, గొండల్, విశ్వదర్ నియోజకవర్గాల నుండి ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా 1995 ఎన్నికల్లో కేశుబాయ్ పటేల్ నేతృత్వంలో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.