పాట్నా: నిర్లక్ష్యంగా రైలు నడిపిన లోకో పైలెట్ ను అధికారులు సస్పెండ్ చేశారు.  ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తూర్పు మధ్య రైల్వేలోని దానపూర్ డివిజన్ పరిధిలో ఓ రైలు ప్రమాదకర రెడ్ సిగ్నల్స్ ను దాటి 500 మీటర్లు ప్రయాణం చేసింది.

టాటా నగర్-దానపూర్ మధ్య ప్రయాణించే  టాటా ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా ప్రమాదకర రెడ్ సిగ్నల్స్ ను దాటి సుమారు 500 మీటర్లను ముందుకు వెళ్లింది.

నిర్లక్ష్యంగా రైలును నడిపినందుకు గాను లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్లను రైల్వే శాఖాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారిక రాజేష్ కుమార్ తెలిపారు.

రైలు ప్రయాణానికి సంబంధించి రెడ్ సిగ్నల్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.

ఈ సమయంలో భారీ అలారం శబ్దం విన్పించింది. రైలు లోకో పైలెట్ ను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.

లోకో పైలెట్ ఎందుకు నిర్లక్ష్యంగా రైలును నడిపారనే విషయమై  అధికారులు ఆరా తీస్తున్నారు. బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్ల జరిగిందా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలా జరిగిందా అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

రెడ్ సిగ్నల్ రైలు ఎందుకు దాటిందనే విషయమై అధికారులు తమ దర్యాప్తులో తేల్చనున్నారు.