దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నగర శివారు ప్రాంతం సీమాపురిలో అనుమానాస్పద బ్యాగ్‌ తీవ్ర కలకలం రేపింది. ఓ గదిలో ఉన్న బ్యాగ్‌లో భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు రిపబ్లిక్‌ డే వేడుకల ముందు ఘాజీపూర్‌ ప్రాంతంలో (Ghazipur) భారీగా ఆర్‌డీఎక్స్‌ పట్టుబడింది

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నగర శివారు ప్రాంతం సీమాపురిలో అనుమానాస్పద బ్యాగ్‌ తీవ్ర కలకలం రేపింది. ఓ గదిలో ఉన్న బ్యాగ్‌లో భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎన్‌ఎస్‌జీ (NSG) , ఢిల్లీ పోలీసు స్పెషల్‌ (delhi police) సెల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఆ ఇంటి నుంచి పారిపోయిన నలుగురు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతకుముందు రిపబ్లిక్‌ డే వేడుకల ముందు ఘాజీపూర్‌ ప్రాంతంలో (Ghazipur) భారీగా ఆర్‌డీఎక్స్‌ పట్టుబడింది. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు సీమాపూరి ప్రాంతంలో పేలుడు పదార్ధాలు నిల్వ చేసినట్టు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ గదిలో అనుమానాస్పద బ్యాగ్‌ లభ్యమైంది.

అంతకుముందు గత నెలలో ఘాజీపూర్‌ పూల మార్కెట్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ బ్యాగును పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్‌తో పాటు ఎన్‌ఎస్‌జీకి సమాచారం అందించారు. అనంతరం ఎన్‌ఎస్‌జీ, బాంబు స్క్వాడ్‌ బృందాలు ఆ బ్యాగును తనిఖీ చేయగా అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఎన్‌ఎస్‌జీ బృందాలు ఆ బాంబును నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై పోలీసులు, భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించాయి.