తమిళనాడు గవర్నర్‌ ఆర్ఎన్ రవితో పాటు బీజేపీ నేత ఖుష్భూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే బహిష్కృత నేత శివాజీ కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు

తమిళనాడు గవర్నర్‌ ఆర్ఎన్ రవితో పాటు బీజేపీ నేత ఖుష్భూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే బహిష్కృత నేత శివాజీ కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కొడుంగయ్యూర్ పోలీసులు ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కృష్ణమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఖుష్బూ నియమితులైన సంగతి తెలిసిందే. దీనిపై శివాజీ మాట్లాడుతూ.. ఆమె ఓ పాత పాత్ర అంటూ వ్యాఖ్యానించారు. 

ఆ వెంటనే స్పందించిన ఖుష్బూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివాజీ తననే కాదు.. గతంలో ఎంతోమంది డీఎంకే నేతలను అవమానించారని , అది వాళ్లకే అలవాటేనంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మహిళలను అవమానించే వారికి డీఎంకేలో కొదవ లేదంటూ ట్వీట్ చేశారు. శివాజీకి ఎంత ఫ్రీడం ఇస్తే.. పార్టీ అన్ని కష్టాల్లో పడుతుందని ఖుష్బూ హెచ్చరించారు. ఈ విషయంపై తక్షణం సీఎం స్టాలిన్ స్పందించాలని.. కానీ ఆయనకు అంత దమ్ములేదంటూ ఖుష్బూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.