Republic Bharat-MATRIZE Exit Poll: రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్.. గెలుపెవ‌రిది అంటే..?

Republic Bharat-Matrize exit poll : ఓటింగ్ ముగిసిన తర్వాత విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ డేటాపైనే ఇప్పుడు అందరి కళ్లు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ మ‌రోసారి కేంద్రంలో మోడీ స‌ర్కారు కోలువుదీరుతుంద‌ని పేర్కొంది.
 

Exit polls 2024 Result: Republic India-Matrize exit poll predictions,  Who is the winner? RMA

Republic Bharat-Matrize exit poll : ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ అంటే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ శ‌నివారంతో ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రావడం మొదలయ్యాయి. లోక్‌సభలోని 543 స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. ఏడో దశలో 58 స్థానాలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చే ఐదేళ్ల పాటు దేశాన్ని ఎవరు పాలిస్తారనే దాని గురించి తమ అంచనాలను పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి దేశంలో మోడీ స‌ర్కారు కోలువుదీరుతుంద‌ని రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచ‌నా వేసింది.

రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్ర‌కారం.. బీజేపీ సీట్లు 300+ మార్కును దాటేశాయి. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ తన ఎగ్జిట్ పోల్‌లో ఎన్డీఏకి 353-368 సీట్లు వస్తాయని అంచనా వేసింది. విపక్షాల ఇండియా కూటమికి 118-133 సీట్లు వస్తాయని అంచనాలో తెలిపింది.  ఇతరులకు 43-48 సీట్లు వస్తాయని రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. దేశంలోనే అత్య‌ధిక స్థానాలు ఉన్న  ఉత్తరప్రదేశ్‌లో లో బీజేపీ చాలా అనుకూల ఫ‌లితాలు ఇస్తాయ‌ని తెలిపింది. రిపబ్లిక్-మ్యాట్రిజ్ తన ఎగ్జిట్ పోల్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్డీయేకు 69-74 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 6-11 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

 

JAN KI BAAT EXIT POLL : మరోసారి మోడీ స‌ర్కారే.. ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు.. జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఇదిగో

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios