PM Modi: పంజాబ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీని రైతులు అడ్డ‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న 20 నిమిషాల పాటు ప్లైఓవ‌ర్ పై ఇరుక్కుపోయారు. దీనికి సంబంధించిన ఎక్సుక్లూజివ్ వీడియో ఇక్క‌డ చూడండి. ఇందులోని దృశ్యాలు గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాని మోడీకి ప్రత్యేక రక్షణ బృందం (SPG) రక్షణ కల్పిస్తూ కనిపించింది.  

PM Modi: పంజాబ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీని రైతులు అడ్డ‌గించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న 20 నిమిషాల పాటు ప్లైఓవ‌ర్ పై ఇరుక్కుపోయారు. పంజాబ్‌లోని హుస్సేనివాలాకు 30 కిలోమీటర్ల దూరంలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు చిక్కుకుపోయారు. బుధ‌వారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధిచిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో, ప్రధాని మోడీ కాన్వాయ్ వేచి ఉన్న ఫ్లైఓవర్ ను నిర‌స‌న కారులు ఇరువైపులా అడ్డుకున్న దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు లాఠీలతో పంజాబ్ పోలీసు సిబ్బంది ముందుకు సాగుతున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది భారత ప్రధాని అధికారిక వాహనానికి రక్షణ కల్పిస్తున్నారు. ఈ నిర‌స‌న‌లు ముగిసే వ‌ర‌కు ప్ర‌ధాని మోడీ వాహ‌నం ముందు సీటులో కూర్చున్నట్లు వీడియో దృశ్యాల్లో క‌నిపించింది. అయితే, నిరసనకారులు అక్క‌డి నుంచి క‌ద‌ల‌డానికి నిరాక‌రించారు. దాదాపు 20 నిమిషాల త‌ర్వాత ప్ర‌ధాని కాన్వాయ్ వెన‌క్కి వెళ్లాల్సి వ‌చ్చింది. 

ఇదిలావుండ‌గా, ప్రధాని పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపంపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న రోజునే ఈ వీడియో వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం. సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ మాట్లాడుతూ, ప్ర‌ధానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల విధి అని అన్నారు. అలాగే, ఎస్పీజీ చ‌ట్టాన్ని గురించి ప్ర‌స్తావిస్తూ.. ఇది రాష్ట్ర అంశం లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య కాదనీ, ప్రధాని రక్షణ అంశం జాతీయ భద్రతా సమస్య అని, ఇది పార్లమెంటరీ పరిధిలోకి వస్తుందనీ, ఈ సంఘటనపై అధికారికంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముంద‌ని మణిందర్ అన్నారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోవడానికి దారితీసిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేయడానికి కేంద్రం ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. మోడీ కాన్వాయ్ ని అడ్డుకున్న ఘ‌న‌ట నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య మరింత వివాదాన్ని రాజేసింది. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ అయ్యింది. ఈ నిర్ల‌క్ష్యంపై తగిన వివరణ ఇవ్వాలని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా నిర్లక్ష్యం చేయడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, జవాబుదారీతనం పరిష్కరించబడుతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. పంజాబ్‌లో భద్రతా ఉల్లంఘనలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మద్దతు తెలిపారు. సిఎం పట్నాయక్ ట్విటర్ వేదిక‌గా.. "భారత ప్రధాని పదవి అనేది రాజ్యాంగ బద్ధమైనది. ఆయనకు పూర్తిస్థాయి భద్రతను అందించడం, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడడం ప్రతి ప్రభుత్వ విధి. ఇది విరుద్ధమైన చ‌ర్య‌. ఏది ఏమైనా.. ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు ..’ అని ట్విట్ట్ చేశారు.


Scroll to load tweet…