Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్సినేష‌న్ లో టీనేజ‌ర్ల ఉత్సాహం.. 11 రోజుల్లో 42 శాతం మందికి ఫ‌స్ట్ డోసు..

టీనేజర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన 11 రోజుల్లో దేశంలోని 42 శాతం మందికి ఇప్పటి వరకు టీకా అందింది. ఈ నెల చివరి వరకు అర్హులైన వారిలో 80-85 శాతం మందికి టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

Excitement of teenagers in vaccination .. First dose for 42% of people in 11 days ..
Author
Delhi, First Published Jan 14, 2022, 11:48 AM IST

వ్యాక్సినేష‌న్ (vaccination)లో టీనేజ‌ర్లు (teenagers) ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి టీనేజ‌ర్ల‌కు కోవిడ్ - 19 వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించింది. అయితే ఈ 11 రోజుల్లో 42 శాతం మంది టీకాలు వేసుకున్నారు. ఈ నెలాఖ‌రు నాటికి దేశంలో 7.40 కోట్ల మంది టీనేజ‌ర్ల‌లో 80-85 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. కోవిన్ (CoWIN) పోర్టల్ ప్రకారం దేశంలోని టీనేజ‌ర్లలో 3,14,87,269 మందికి వ్యాక్సిన్ అందించారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియా (central health minister mansuk mandaviaya) టీకాలు వేసుకున్న టీనేజ‌ర్ల‌ను ప్ర‌శంసించారు. భార‌త‌దేశ యువ‌త‌కు గొప్ప బాధ్య‌త, ఉత్సాహం ఉంద‌ని అన్నారు. అర్హులైన యువ‌కులు అంద‌రూ వ్యాక్సిన్ (vaccine) వేసుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ (tweet) చేశారు. అయితే ప్ర‌స్తుతం టీనేజ‌ర్ల‌కు దేశీయంగా భారత్ బయోటెక్ సంస్థ త‌యారు చేసిన కోవాక్సిన్ మాత్రమే అందిస్తున్నారు. టీనేజ‌ర్ల‌కు అందించ‌డానికి అన్ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అవ‌స‌ర‌మైన కోవాక్సిన్ డోసుల‌ను పంపించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (centra health ministry) గురువారం తెలిపింది.

కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAIG) చైర్మ‌న్ ఎన్ కే అరోరా (nk arora) వ్యాక్సినేష‌న్ విష‌యంలో మీడియాతో మాట్లాడారు. టీనేజ‌ర్ల కోసం కొన‌సాగుతున్న వ్యాక్సినేష‌న్ డ్రైవ్ క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమేయ‌డానికి దేశం చేస్తున్న పోరాటానికి మ‌రింత బ‌లం చేకూర్చింద‌ని అన్నారు. టీనేజర్లకు టీకాలు వేయడం వల్ల తల్లిదండ్రులకు ధైర్యం వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. వారిని స్కూళ్ల‌కు (schools) పంపించేందుకు న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. క‌రోనా (corona) నిబంధ‌న‌లు అనుస‌రిస్తూ సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంలో ఎంతో స‌హాయ‌ప‌డుతుంద‌ని అన్నారు. 

రెండు రోజుల కిందట టీనేజ‌ర్లు రెండు కోట్ల డోసులు వేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ (prime minister modi) స్పందించారు. పిల్లల‌ను ప్ర‌శంసించారు. రెండు కోట్ల క‌రోనా వ్యాక్సిన్ మొద‌టి డోసును అందుకొని టీనేజ్ పిల్ల‌లు అద‌ర‌గొట్టార‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఇదే స్పూర్తిని కొన‌సాగించాల‌ని కోరారు. ‘‘ నా యువ మిత్రులారా.. మీరు చాలా అద్భుతం చేశారు. ఈ ఊపును కొన‌సాగిందాం. కోవిడ్-19 ప్ర‌తీ ఒక్క‌రం పాటిద్దాం. మీరు ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోక‌పోతే వెంటే వేయించుకోవాల‌ని కోరుతున్నాను.’’ అంటూ ప్రధాని ట్వీట్ (tweet) చేశారు. టీనేజర్లకు టీకాలు వేయాలనే నిర్ణయం కరోనా మహమ్మారిపై మన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లల గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల ఒత్తిడిని తగ్గిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.క‌రోనా (corona) కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో టీనేజ్ (teenage)  పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ (vaccination drive)  వేగంగా సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios