ఇతర పలు విషయాల గురించి మోదీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మోదీ ట్విట్టర్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనులకు సంబంధించి.. ఇతర పలు విషయాల గురించి మోదీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మోదీ ట్విట్టర్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. తాజాగా.. ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేయగా.. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జాతీయ పార్క్‌లో దాదాపు 3 వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న ఆ దృశ్యం భలే ఉంది. 

పెద్ద గుంపుగా వరసగట్టిన జింకలు చెంగుచెంగుమంటూ రోడ్డు దాటుతున్న తీరు ఎక్సలెంట్ అంటూ మోదీ దీన్ని షేర్‌ చేయడంతో దానికి లైక్‌లు కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. గుజరాత్‌ ఇన్ఫర్మేషన్‌ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన వీడియోనే మోదీ కూడా షేర్ చేశారు. 

వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో పై లుక్కేయండి. 

Scroll to load tweet…