Asianet News TeluguAsianet News Telugu

ఐసీయూలో మాజీ ముఖ్యమంత్రి.. ఫోన్ చేసి ఆరా తీసిన ప్రధాని...

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆదివారం చేర్పించారు.

Ex-Uttar Pradesh Chief Minister Kalyan Singh In ICU, PM Calls His Son - bsb
Author
Hyderabad, First Published Jul 5, 2021, 3:30 PM IST

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆదివారం చేర్పించారు.

ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండో క్రినాలజీ, న్యూరో ఓటోలజీ విభాగాల నిపుణుల బృందాన్ని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. 

కల్యాణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆ రామున్ని ప్రార్థిస్తున్నానంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. మరోవైపు కల్యాణ్ సింగ్ ఆరోగ్యపరిస్థితి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు రాజ్ వీర్ కు ఫోన్ చేసి, వివరాలను తెలుసుకున్నారు. 

అలాగే ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సీఎం యోగీని కోరారు. అంతకు ముందు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కేశవ్ ప్రసాద్, మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వాత్రా దేవ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించిన కల్యాణ్ సింగ్ ను పరామర్శించారు. కాగా రాజస్థాన్ గవర్నర్ గా కూడా కల్యాణ్ సింగ్ పనిచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios