కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌తో పాటు మరో వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి నాగ్‌పూర్‌కు హాన్స్‌రాజ్ నాలుగు వాహనాల్లో బయలుదేరారు.

ఈ క్రమంలో చంద్రాపూర్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గ్రామానికి సమీపంలో లారీ డ్రైవర్ ఒక్కసారిగా మలుపు తిప్పడంతో హన్స్‌రాజ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం లారీని వేగంగా ఢీకొట్టింది.

సదరు కారులో ఆహిర్ లేకపోవడం వల్ల ఆయనకు ప్రమాదం తప్పింది. అయితే ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్, మరో వ్యక్తి దుర్మరణం పాలవ్వగా , ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.