Ex-Japan PM: హ‌త్య‌కు గురైన దేశాధినేత‌లు, ప్ర‌పంచ నాయ‌కులు వీరే..  ఇందిరా గాంధీ నుంచి షింజో వ‌ర‌కు..

Ex-Japan PM Shinzo Abe dead: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే కాల్పుల‌ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. భారత్‌కు చెందిన ఇద్దరు సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు, అగ్రనేతల హత్య‌కు గుర‌య్యారు. అగ్ర‌శ్రేణి ప్ర‌పంచ నాయ‌కుల హ‌త్య‌పై ఓ లూక్ వేద్దాం.

Ex Japan PM Shinzo Abe dead: A look at top Heads Of State, World Leaders Who Were Assassinated

Ex-Japan PM Shinzo Abe dead: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణంగా హత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్‌లో ప్రచారం చేస్తుండ‌గా..  దుండగుడి జ‌రిగిన కాల్పుల్లో ఆయ‌న తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ప‌తికి త‌ర‌లించే లోపే ప్రాణాలు విడిచినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. ఈ ఘ‌ట‌న‌పై భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.  అతని మరణానికి సంతాపం తెలిపారు. నేడు భార‌త్ మొత్తం జపాన్ కు సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ కష్ట సమయంలో జపాన్ సోదరులు, సోదరీమణులకు భార‌త్ సంఘీభావంగా ఉంటుంద‌ని  అన్నారు. 

67 ఏళ్ల అబే శుక్రవారం నారాలో ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాలకే వెనుక నుంచి ఓ దుండ‌గుడు  కాల్చి చంపారు. అత్యవసర చికిత్స నిమిత్తం అతడిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు నిర్ధారించారు. జపాన్‌లో పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ దాడి ఘటనా స్థలంలో అనుమానాస్పద సాయుధుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ త‌రుణంలో ప్రపంచవ్యాప్తంగా హ‌త్య‌కు గురైన‌ పలువురు దేశాధినేతలు, అగ్రనేతల హత్య‌కు గుర‌య్యారు. అగ్ర‌శ్రేణి ప్ర‌పంచ నాయ‌కుల హ‌త్య‌ల‌పై ఓ లూక్ వేద్దాం. 
 
>> 1984లో అప్పటి  భార‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీని త‌న సెక్యూరిటీ గార్డుల చేతిలో హత్యకు గురయ్యారు. 'ఐరన్ లేడీ'గా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ 1984 అక్టోబర్ 31న ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రోడ్ 1లోని తన అధికారిక నివాసంలో భద్రతా సిబ్బంది చేతిలో హ‌త్య‌కు గుర‌య్యారు. ఆమెను హుటాహుటిగా AIIMSకి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాత‌. 
 
>> అలాగే.. ఇందిరాగాంధీ మరణానంతరం ప్రధానమంత్రి పదవిగా బాధ్య‌తలు చేపట్టిన ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ కూడా హ‌త్య‌కు గుర‌య్యారు. ఆయ‌న 1991 మే 21వ తేదీ రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ఓ మహిళా జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.


 ప్రపంచవ్యాప్తంగా.. హత్యకు గురైన ఇతర దేశాధినేతలు

>> అమెరికన్ సివిల్ వార్ కు నాయకత్వం వహించిన 16వ US అధ్యక్షుడు లింకన్. ఆయ‌న ఏప్రిల్ 14, 1865న వాషింగ్టన్, DCలోని ఫోర్డ్స్ థియేటర్‌లో హ‌త్య‌కు గుర‌య్యారు.  అమెరికన్ రంగస్థల నటుడు జాన్ విల్కేస్ బూత్ చేత కాల్చి చంపబడ్డాడు. థియేటర్ వారసత్వ సంపదగా భద్రపరచబడింది. 

>> అలాగే.. జాన్ ఎఫ్ కెన్నెడీ.. US 35వ అధ్యక్షుడు. అతని ముద్దుపేరు 'JFK. ఆయ‌న .. నవంబర్ 22, 1963న డల్లాస్‌లో హత్యకు గురయ్యారు. ఆయ‌న‌ జాక్ రూబీ చేత కాల్చి చంపబడ్డాడు.

>> బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటిన బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ మే 1981లో చిట్టగాంగ్‌లో హత్యకు గురయ్యారు.
 
>> అవిభక్త భారతదేశంలోని కర్నాల్‌లో జన్మించిన లియాఖత్ అలీ ఖాన్, 1947-51 మధ్యకాలంలో పాకిస్థాన్‌కు మొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. అక్టోబరు 16, 1951న రావల్పిండిలోని కంపెనీ బాగ్‌లో ఒక సభలో ప్రసంగిస్తుండగా..  ఆయన హత్యకు గురయ్యారు. అతని గౌరవార్థం ఈ తోటకి తరువాత లియాఖత్ బాగ్ అని పేరు పెట్టారు.

>> 2007లో  రావల్పిండిలో మరో పాకిస్తానీ నాయకుడు హత్యకు గురయ్యారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో డిసెంబర్ 27, 2007న ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆమె కొద్దిసేపటికే రావల్పిండిలో ఆత్మాహుతి దాడి జ‌రిగింది. అనంతరం ఆమెపై దాడి చేసి ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయిందని ప్రకటించారు. డాన్‌లోని 2014 నివేదిక ప్రకారం.. ఆమె మరణించిన రావల్పిండి సెంట్రల్ హాస్పిటల్ ను  తర్వాత బెనజీర్ భుట్టో ఆస్ప‌త్రిగా పేరు మార్చబడింది.

>> శ్రీలంకలోనూ నాయ‌కుల‌పై దాడులు జ‌రిగాయి.  1989 నుండి 1993 మధ్యకాలంలో అధ్యక్షుడిగా ఉన్న రణసింగ్ ప్రేమదాస 1993లో హత్యకు గురయ్యారు. 

>> సెర్బియా ప్రధాన మంత్రి జోరన్ జింద్జిక్  కూడా హత్య‌కు గుర‌య్యారు. రేడియో ఫ్రీ యూరోప్/రేడియో లిబర్టీ వెబ్‌సైట్ ప్రకారం, మార్చి 12, 2003న,  బెల్గ్రేడ్‌లో స్నిపర్ చేత హత్య చేయబడ్డాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios