Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాధవ్ సింగ్ సోలంకి కన్నుమూత

వృత్తిరీత్యా న్యాయవాది అయిన సోలంకి.. 1976లో కొంతకాలం ముఖ్యమంత్రి పని చేశారు. మళ్లీ 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 

Ex Gujarat CM Madhavsinh Solanki passes away, PM Modi condoles his demise
Author
Hyderabad, First Published Jan 9, 2021, 11:02 AM IST

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి(94) కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు.

మాధవ్‌సింగ్ సోలంకి 1980ల్లో గుజరాత్‌లో కేహెచ్‌ఏఎం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) సూత్రంపై అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికలకు ముందు కేహెచ్‌ఏఎం కూటమిని ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సోలంకి.. 1976లో కొంతకాలం ముఖ్యమంత్రి పని చేశారు. మళ్లీ 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 

1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. మాజీ సీఎం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలు పాటు గుజరాత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాధవ్‌సింగ్ సోలంకి బలీయమైన నాయకుడని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమారుడు భారత్‌తో మాట్లాడి, సంతాపం తెలిపినట్లు ట్వీట్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios