కర్ణాటకలో మరోసారి డైరీ కలకలం రేపింది. బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు.. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మంత్రికి రూ.150కోట్లు చెల్లించినట్లు డైరీలో ఉందని.. ఇప్పుడు ఆ డైరీ ఆదాయపన్ను శాఖ అధికారుల చేతుల్లో ఉందని.. అయితే.. ఆ డైరీ బయటకు రాకుండా ఉండేందుకు సదరు కేంద్ర మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారంటూ  స్వాతి చతుర్వేది అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

కాగా.. ఆమె చేసిన ఆరోపణలకు బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ వేదిగా సమాధానం చేశారు. ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమంటూ తిప్పి కొట్టారు. 

నిజమైన డైరీ వ్యవహారం.. కర్ణాటకలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసంటూ రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2018లో ఇది బయటకు వచ్చిందని.. దీనిని క్రియేట్ చేసింది.. రాహుల్ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడైన డీకే శివకుమార్ అంటూ ఆయన తెలిపారు.  కాంగ్రెస్ నాయకులకు చెల్లించిన ముడుపులకు చెందిన అసలైన  స్టీల్ ఫైఓవర్ డైరీ వివరాలన్నీ బయటకు రాకుండా చూసేందుకే తమ పార్టీ నేతలపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.