రాష్ట్రంలోని 11.5లక్షల మంది రైతుల అకౌంట్లలో 452 కోట్లను జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కో రైతుకి 4వేల రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపాడు. ఈ పెట్టుబడి సహాయం నేరుగా రైతుల అకౌంటులో జమ చేయనున్నట్టు ప్రకటించారు.
రాంచి: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఆ రాష్ట్ర రైతులకు ఎన్నికల వేళ ఒక తీపి కబురు చెప్పారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కో రైతుకి 4వేల రూపాయలను ఇవ్వనున్నట్టు తెలిపాడు. ఈ పెట్టుబడి సహాయం నేరుగా రైతుల అకౌంటులో జమ చేయనున్నట్టు రఘుబర్ దాస్ ప్రకటించారు.
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేసారు. రాష్ట్రంలోని 11.5లక్షల మంది రైతుల అకౌంట్లలో 452 కోట్లను జమ చేయనున్నట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి తెలిపారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ సంవత్సరాంతం నవంబర్-డిసెంబర్ మాసాల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 12, 2019, 8:20 AM IST