Asianet News TeluguAsianet News Telugu

నన్ను అరెస్ట్ చేయడం వాళ్ల తండ్రి వల్ల కూడా కాదు.. రాందేవ్ బాబా మరో వివాదం...

అల్లోపతి వైద్యం మీద యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగడం లేదు. దీనికి తోడు.. ‘నన్ను అరెస్ట్ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు’ అనే వ్యాఖ్యలు మరో వివాదానికి తెర తీశాయి. 

Even their father can t arrest me : Another Ramdev video goes viral - bsb
Author
Hyderabad, First Published May 27, 2021, 12:34 PM IST

అల్లోపతి వైద్యం మీద యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగడం లేదు. దీనికి తోడు.. ‘నన్ను అరెస్ట్ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు’ అనే వ్యాఖ్యలు మరో వివాదానికి తెర తీశాయి. 

ఇప్పటికే అల్లోపతి మీద రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలమీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ విభాగం రూ. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా కూడా వేసిన విషయం తెలిసిందే. తాజాగా రాందేవ్ బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

‘నన్ను అరెస్ట్ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు’ అని వ్యాఖ్యానించారు. అల్లోపతి వైద్యం మీద చేసని వ్యాఖ్యల తరువాత రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది. జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. 

అంతేకాడు దుండగుడు రాందేవ్, మహాదొంగ రాందేవ్ వంటి పదాలు తనమీద వస్తున్నాయని చెబుతూ నవ్వుకున్నారు. అయితే అతను అన్న ‘నీ తండ్రి కూడా అరెస్ట్ చేయలేడు’ అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందా.. అని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరైతే మోడీ ప్రభుత్వానికే రాందేవ్ బాబా సవాల్ విసిరాడంటూ ట్వీట్ చేస్తున్నారు. 

కాగా, అల్లోపతి మీద రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. తాజాగా బీహార్ బిజెపి అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. యోగాలాంటి ప్రాచీన విద్యను "కోకోకోలా" అంత ప్రాచుర్యంలోకి తెచ్చిన యోగా గురువు.. కానీ ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలు ఆయనలో లేవు అంటూ ఎద్దేవా చేశారు. 

బీహార్, పశ్చిమ చంపారన్ నుండి రెండుసార్లు ఎంపీ, క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సంజయ్ జైస్వాల్. ఇలాంటి శక్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, విడిచిపెట్టకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను కోరారు.

రామ్ దేవ్ బాబా వివాదం : యోగా గురువే కానీ...యోగి కాదు.. సంజయ్ జైస్వాల్...

"రామ్‌దేవ్ యోగా గురువు. ఆయన యోగాపై ప్రావీణ్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు. కాని అతను ఖచ్చితంగా యోగి కాదు. యోగి అంటే తన ఇంద్రియాలను, మాటలను బాగా అదుపులో ఉంచుకునేవాడు" అని జైస్వాల్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

"యోగా కోసం ఆయన చేసిన దాన్ని, కోకోకోలా ప్రాచుర్యం కోసం చేసిన పనితో పోల్చవచ్చు. పూర్వం నుంచి భారతీయులు  'షికంజీ, తండై' తినేవారు, కానీ శీతల పానీయాల దిగ్గజం వచ్చిన తరువాత ప్రతి ఇంట్లో పెప్సి, కోక్ బాటిల్స్ తో నిండిపోయాయనిపిస్తుంది" అని జైస్వాల్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఆయన వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిచ్చే ఇలాంటి యోగా గురువు లేవనెత్తే సమస్యల్లో తాము చిక్కుకోవద్దని ఐఎంఎను ఆయన కోరారు. మనం చేసే పనిలో వెనక్కి తగ్గకూడదు. మన విలువను పోగొట్టుకోకూడదు. మన వృత్తి మీద దృష్టి పెడతాం.. ఇప్పటివరకు మనం కోల్పోయిన మన సహోద్యోగులను కోల్పోయాం. కోవిడ్ 19 నేపథ్యంలో ప్రాణాల్ని ఫణంగా పెట్టి పోరాడారు అని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios