చ‌నిపోయిన వారికి కూడా పెళ్లిళ్లు జ‌రుగుతాయి.. ఎక్క‌డో తెలుసా?

Pretha Kalyanam: ప్ర‌పంచంలోని కొన్ని ప్రాంతాల్లో అనుస‌రించే ఆచారాలు.. వారి సంస్కృతి మ‌న‌కు క్యూరియాసిటీ కలిగించడంతో పాటు మరికొంత విచిత్రంగానూ అనిపిస్తుంటాయి. ఇప్పుడు మీకు చెప్పబోయేది అలాంటి విషయం గురించే.. అక్కడ చనిపోయిన వారికి కూడా పెళ్లిళ్లు జరుగుతాయి..  ! 
 

Even dead people get married.. Do you know somewhere?

Pretha Kalyanam: కొన్ని ప్రాంతాలు విభిన్న సంస్కృతులు, సాంప్ర‌దాయాల‌కు నెల‌వుగా ఉంటాయి. అలాగే, ఆ ప్రాంతాల్లోని ఆచార‌వ్య‌వ‌హారాలు కాస్తా విచిత్రంగానూ.. క్యూరియాసిటీగా ఉండేవి చాలానే ఉంటాయి. అలాంటి కోవ‌కు చెందిన‌దే.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విష‌యం.. అక్క‌డ చ‌నిపోయిన వారికి కూడా పెళ్లిళ్లు జ‌రుగుతాయి. చ‌నిపోయిన త‌ర్వాత పెండ్లి ఎలా? అనే ప్ర‌శ్న మీకు రావ‌చ్చు.. కానీ ఇది నిజం.. మ‌రణం తర్వాత పెళ్లి అనేది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ ఇది జ‌రిగింది. చాలా కాలం నుంచి అక్క‌డ ఇలాంటివి జ‌రుగుతున్నాయి. తాజాగా 30 ఏండ్ల  క్రితం చ‌నిపోయిన ఇద్ద‌రు పెండ్లి చేసుకున్నారు. సాధార‌ణంగా పెండ్లి అంటే ఎంత కోలాహ‌లం ఉంటుందో అలానే వీరి పెండ్లి కూడా జ‌రిగింది. ఓ వ్యక్తి దీనిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది. 

విరాల్లోకెళ్తే... శోభ, చందప్ప అనే ఇద్దరు చిన్నారులు గురువారం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, వారిలో ఎవరూ సజీవంగా లేరు. ఇదే అక్క‌డి విచిత్ర విశేషం. నిజానికి, ఈ వివాహ వేడుక వారి మరణించిన 30 సంవత్సరాల తర్వాత నిర్వహించారు. ఇది క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో జ‌రిగింది. చ‌నిపోయిన వారి ఇరువురి కుటుంబ స‌భ్యులు క‌లిసి ఈ వివాహం జ‌రిపించారు. 

ఇది ఇక్క‌డి సాంప్ర‌దాయం.. అదే ప్రేత క‌ళ్యాణం..! 

ఇది 'ప్రేత కల్యాణం' లేదా 'చనిపోయిన వారి వివాహం' అనే పేరుగల దీర్ఘకాల సంప్రదాయంలో భాగంగా జరిగింది. ఇది కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే సంప్రదాయం. ఇక్కడ పుట్టిన ప్ర‌తిఒక్క‌రికీ.. అలాగే, పెండ్లి కాకుండా మరణించిన వారికి వివాహం చేస్తారు. ఇక్కడి కమ్యూనిటీలు తమవారి ఆత్మలను గౌరవించే మార్గంగా దీనిని నమ్ముతారు.

 

అయితే ఇది కర్ణాటకలోని మంగళూరులో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. సాధారణంగా 18 ఏళ్లలోపు-అవివాహితులు,  వారు మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి మరణ కథనాలు ఉన్నవారిని వివాహం చేసుకుంటారు. కుటుంబ సభ్యులు నిలబడి ఈ పెళ్లి జరిపించారు. ఎందుకంటే వారు వివాహం చేసుకోని కారణంగా తమ ఆత్మీయుల  ఆత్మలు ఇక్క‌డే సంచరిస్తుందని ప్రజలు నమ్ముతారు. వివాహం లేకుండా ఒకరి జీవితం అసంపూర్ణంగా ఉన్నందున ఆత్మ ఎప్పుడూ మోక్షాన్ని పొందదని నమ్ముతారు. సంచారం చేసే ఆత్మ కారణంగా కుటుంబం సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించవచ్చు..  కాబట్టి చ‌నిపోయిన పెండ్లి కాకుండా చ‌నిపోతే వారికి ప్రేత క‌ళ్యాణం జ‌రిపిస్తారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios